అవన్నీ నా ప్రపంచంలో భాగమయ్యాయి.. నాలుగేళ్ల సినీ ప్రయాణంపై నివేదా థామస్
తెలుగు నాట కేరళ ముద్దుగుమ్మల హవా బాగానే నడుస్తూ ఉంటుంది. ఆ మధ్య వరుసగా మళయాలీ అందం టాలీవుడ్‌లో హల్చల్ చేసింది. అందులో నివేదా థామస్ ఒకరు. నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మెన్ చిత్రంతో నివేదా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కాస్త ఎమోషనల్ అయింది. ఈ క్రమంలో తన ఈ నాలుగేళ్ల సినీ ప్రయాణం గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
జెంటిల్‌మెన్, జైలవకుశ, నిన్నుకోరి, 114, బ్రోచేవారెవరూ వంటి చిత్రాలతో మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. అయితే మధ్యలో తన చదువును పూర్తి చేసుకునే క్రమంలో కొన్ని రోజులు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. అందుకే జెంటిల్‌మెన్, నిన్ను కోరి వంటి చిత్రాల తరువాత గ్యాప్ వచ్చింది. అయితే నివేదా రీసెంట్‌గా దర్భార్ చిత్రంతో అందర్నీమెప్పించింది. రజినీ కూతురుగా నటించి ఆకట్టుకుంది.

నివేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 4 సంవత్సరాల క్రితం ఈ రోజు, నేను కొత్త పరిశ్రమలో అడుగుపెట్టాను. కొత్త భాష నేర్చుకున్నాను. భిన్న వ్యక్తులను కలుసుకున్నాను.. కొత్త కొత్త నైపుణ్యాలను ఎంచుకోవడం ప్రారంభించాన .. కథలు, సినిమాలు, చర్చలు, ఆలోచనలు, సంభాషణలు, ప్రశ్నలు, పాత్రలు, స్క్రిప్ట్‌లు నా ప్రపంచంలో ఒక భాగంగా మారాయి. నేను దీన్ని చాలా ప్రేమిస్తున్నాను గట్టిగా కౌగిలించుకుంటాను. ఏదేమైనా, ఈ 4 సంవత్సరాలు మంచిగానే గడిచాయి.. ఇంకా మంచి చిత్రాలతో, పాత్రలతో మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తున్నాను. మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు'అని పేర్కొంది.


Click it and Unblock the Notifications











