‘జై బాలయ్య’కు యంగ్ హీరోయిన్ ఫిదా.. అలా స్టెప్స్ వేసేసిందిగా.. అంతా బాగానే ఉంది కానీ?
బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమా వచ్చి ఇరవై రోజులు దాటుతున్నా ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సహా ఫైట్స్ జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలో ఉన్న జై బాలయ్య పాటకు కుర్ర హీరోయిన్ కాలు కదిపింది. ఆ వివరాల్లోకి వెళితే..

నట విశ్వరూపం
చాలా కాలం నుంచి సరయిన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న బాలకృష్ణ అఖండ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించారు. తనకు బాగా అచ్చొచ్చిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సారి వచ్చిన చిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది.

తమన్ నేపథ్య సంగీతం
ఒకరకంగా సెకండ్ వేవ్ తరువాత అంటే చాలా కాలం తర్వాత తెరచుకున్న థియేటర్లకు గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చిన ఈ సినిమా తరువాత రిలీజ్ చేస్తున్న సినిమాల నిర్మాతలకు కూడా మంచి నమ్మకం ఇచ్చింది. ఈ సినిమాలో ఫైట్స్, బాలకృష్ణ అఘోరా గెటప్ మాత్రమే కాక తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్‌గా నిలిచింది.

జై బాలయ్య సాంగ్
ఈ సినిమాలో సాంగ్స్, బీజీఎంతో మాస్ ప్రేక్షకులను కిర్రాక్ అనిపించారు తమన్. అఖండలో అఘోర పాత్రతో పాటు రైతు పాత్రలో కూడా నటించి రెండు షేడ్స్‌లో అలరించిన బాలకృష్ణ ఒకే ఒక్క పాటలో మాస్ బీట్‌కు స్టెప్పులేసి అదరగొట్టారు. అయితే జై బాలయ్య అనే సాంగ్ సినిమా రిలీజ్‌కు ముందే సూపర్ హిట్ అయింది. ఈ పాట విడుదలవడంతోనే నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చేసి ఆకట్టుకున్నారు.

సోషల్ మీడియాలో షేర్ చేయడం
ఆ తరువాత కూడా ఆ పాటకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా స్టెప్పులేసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ట్రెండ్‌గా కూడా మారింది. ఆఖరికి విదేశాల్లో ఉన్న విదేశీ యువత సైతం ఈ పాటకు ఆకర్షితులు అయ్యారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక తాజాగా ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ జై బాలయ్య పాటకు స్టెప్పులేసింది టాలీవుడ్ బ్యూటి, హీరోయిన్ నివేదా థామస్.

స్టెప్పులు వేయడానికి
ఈ కేరళ కుట్టి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన తమ్ముడితో కలిసి భిన్నమైన పోస్ట్‌లు, వీడియోలు పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఏమనుకుందో ఏమో కానీ బుధవారం నాడు ఆమె జై బాలయ్య సాంగ్‌లోని స్టెప్పులు వేయడానికి ప్రయత్నించింది నివే

బ్లూపర్ గా మార్చేసి
మాములుగా వేసేసి ఊరుకుంటే ఏం బాగుంటుంది? అనుకుందో ఏమో పాటలో డ్యాన్స్ మూమెంట్స్ యాజిటీజ్ గా దింపడానికి పాటలో వాడిన టెక్నీక్స్ నే వాడింది. అలా మొదటి షర్ట్ లాగే వరకూ బానే ఉంది. రెండో షర్ట్ లాగుతున్నప్పుడు తన తమ్ముడు దానిని సరిగా లాగక పోవడంతో తాను కూడా నవ్వుతూ ఆ వీడియోను బ్లూపర్ గా మార్చేసి ఫన్ క్రియేట్ చేసింది నివేదా. ఈ వీడియోను షేర్ చేస్తూ 'ఏదేమైనా అఖండ ఎక్స్‌పీరియెన్స్ అదిరిపోయింది' అని కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











