ప్రభాస్ సినిమాలో నివేదా థామస్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోవాలి అంటే మొదట్లో నటిగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొందరు మాత్రమే పెద్దగా కష్టపడకపోయినా అందం అనే అదృష్టంతో చాలా ఈజీగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటారు. ఇక గ్లామర్ పాత్రలను పెద్దగా టచ్ చేయని హీరోయిన్స్ కి పెద్ద సినిమాల్లో అవకాశం అంటే అంత ఈజీ కాదు.
ఇప్పటివరకు నిత్య మీనన్ లాంటి బ్యూటీలు మాత్రమే హాటుగా కనిపించకుండా బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. అయితే అదే తరహాలో నివేదా థామస్ కూడా పెద్ద హీరోలను టార్గెట్ చేస్తోంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ సినిమాలకు చాలానే ఉపయోగపడ్డాయి. బ్యూటీ దగ్గర మంచి టాలెంట్ ఉందని ఇప్పుడు అగ్ర దర్శకులు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి మరి స్పెషల్ పాత్రలకు సెలెక్ట్ చేసుకుంటున్నారు.

నివేత థామస్ నెక్స్ట్ ప్రభాస్ సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించనుందట. వైజయంతి మూవీస్ లో ప్రభాస్ చేస్తున్న సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా దీపిక పదుకొనెను సెలెక్ట్ చేసుకోగా మరో సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం నివేదాని సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదివరకె నివేదా థామస్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటు తమిళ్, మలయాళంలో కూడా కొన్ని సినిమాలకు గ్రీన్ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











