నన్ను చెల్లిగానో, అక్కగానో ఊహించుకోవద్దంటున్న హీరోయిన్!

సినిమా రంగంలో హీరోయిన్లుగా రాణించాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చిన వారు ప్రేక్షకుల ఊహల్లో డ్రీమ్ గర్ల్‌గా, శృంగార దేవతగా నిలిచిపోవాలని ఆశ పడుతుంటారు. అలాంటి ఇమేజ్ ఉన్నంతవరకే వారు హీరోయిన్లుగా ఇండస్ట్రీలో వెలుగొందుతారు. అందుకే తమపై అదే ఇమేజ్ ఉండేలా జాగ్రత్తపడతారు. చాలా మంది హీరోయిన్లు చెల్లి పాత్రలు, అక్క పాత్రలు ఒప్పుకోక పోవడానికి ప్రధాన కారణం ఇదే. కేరళ బ్యూటీ సౌత్ బ్యూటీ నివేతా థామస్ కూడా దీన్ని ఫాలో అవుతోంది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీలో నివేతా థామస్‌ను చెల్లిపాత్రకు ఎంపిక చసినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని నివేతా థామస్ తన సన్నిహితుల ద్వారా ఖండించింది. తనను అలాంటి పాత్ర కోసం ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేసింది.

Nivetha Thomas not playing sister role in Allu Arjun’s film

ప్రస్తుతం నివేతా థామస్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన 'బ్రోచేవారెవరురా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న నాని, సుధీర్ బాబు మూవీ 'వి'లో మెయిన్ లీడ్‌గా నటిస్తోంది.

బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో సిస్టర్ రోల్ చేయడానికి ఒప్పుకుంటే... ఇకపై తనకు హీరోయిన్ ఛాన్సులు వచ్చే అవకాశం లేదని, వరుసగా అలాంటి పాత్రలు వచ్చే ప్రమాదం ఉందని ఈ కేరళ బ్యూటీ భయపడుతోందట. 'జై లవ కుశ' చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా నటించిన నివేతా... తనను చెల్లి పాత్రల్లో, అక్క పాత్రల్లో ఊహించుకోవద్దని పరోక్షంగా సంకేతాలు పంపుతోంది.

నివేతా థామస్ ఈ సినిమాలతో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న 'దర్బార్' అనే తమిళ చిత్రంలో కూతురు పాత్రలో నటిస్తోంది. దీంతో పాటు శ్వాస అనే మరో తెలుగు చిత్రానికి కమిటైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X