కాబోయే భర్త గురించి నివేదా థామస్.. రొమాంటిక్ లైఫ్‌పై లవ్లీ కామెంట్స్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకొన్న నివేదా థామస్ విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. రాశి కంటే వాసిని నమ్ముకొన్న ముద్దుగమ్మ విలక్షణమైన పాత్రలనే ఎంచుకొంటూ అన్ని వర్గాల ప్రశంసలు అందుకొంటున్నారు. కెరీర్‌ను, ఎడ్యుకేషన్‌ను బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్న నివేదా థామస్ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన కాబోయే భర్త గురించి, తన వ్యక్తిగత విషయాలను, తన అభిప్రాయాలను చెబుతూ..

బాలనటిగా విజయ్‌తో కలిసి
నివేదా థామస్ బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. కురువు అనే చిత్రంలో విజయ్‌కి చెల్లెలుగా నటించడం ద్వారా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లాలో కూడా విజయ్‌కి సోదరిగా నటించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్నారు. తనకు నచ్చిన చిత్రాలనే ఎంపిక చేసుకొంటూ నటనపరంగా అన్ని వర్గాల ప్రశంసలు అందుకొంటున్నారు.

రూమర్లకు, గాసిప్స్‌కు దూరంగా
నివేదా థామస్ విషయానికి వస్తే గాసిప్స్, రూమర్లకు చాలా దూరంగా ఉంటారు. తనపై ఎలాంటి రూమర్లు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. తన వృత్తి తప్ప మరో విషయంలో జోక్యం చేసుకొన్నట్టు కనిపించరు. వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉంటూ పూర్తిగా కెరీర్, వ్యక్తిగత విషయాలపైనే దృష్టిపెట్టినట్టు కనిపిస్తారు.

కెరీర్‌పైనే దృష్టి అంతా
ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమ, పెళ్లి అనే విషయాలపై ఆసక్తి లేదు. ప్రస్తుతం చదువు, కెరీర్‌పైనే నా దృష్టి అంతా. ఉత్తమ పాత్రలతో ఆకట్టుకోవాలనేది నా ప్రయత్నం. అంతేగానీ పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు అని స్పష్టం చేశారు. జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి అంటూ నివేదా థామస్ పేర్కొన్నారు.

ప్రేమ, పెళ్లి గురించి విషయాలు
ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడమనే విషయాలపై నేను ఎలాంటి అభిప్రాయాలను ఏర్పరుచుకోలేదు. ప్రేమలో పడటమనేది సహజంగా జరిగే విషయం. ఇక పెళ్లి అనేది ఎవరితో, ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. అలాంటి వాటిపై నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం సరికాదు అని నివేదా థామస్ పేర్కొన్నారు.

రొమాంటిక్ లైఫ్ గురించి ప్లాన్స్
జీవితంలో పెళ్లి, రొమాంటిక్ లైఫ్‌కు సంబంధించిన ప్లాన్స్ ఏమీ లేదు. నా కాబోయే భర్త అలా ఉండాలి. ఇలా ఉండాలని అనుకోవడం లేదు. ఎవరైనా సరే నిజాయితీగా, నమ్మకంగా ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకొని మరోటి బయటకు మాట్లాడే మనస్తత్వం ఉండకూడదు. నా లక్ష్యాలను, ఇష్టాలను, సుఖం, సంతోషాలు, కష్టాలు అన్ని పంచుకొనే లక్షణాలు కాబోయే భర్తలో ఉండాలని కోరుకొంటాను నివేదా థామస్ చెప్పారు.

పవన్, రజనీ, కమల్‌తో నివేదా థామస్
ఇక నివేదా థామస్ కెరీర్ విషయానికి వస్తే.. అగ్ర హీరోలతో కలిసి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్, సూపర్ స్టార్ కమల్ హాసన్‌తో ఇండియన్ 2 చిత్రంలో, రజనీకాంత్ కలిసి అన్నాతేలో నటిస్తున్నారు. శ్వాస, సుధీర్ వర్మ దర్శకత్వం వహించే ఓ చిత్రంలో నటిస్తారు. ఇటీవల ఆమె నటించిన దర్బార్, బ్రోచేవారెవరురా చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.


Click it and Unblock the Notifications











