హీరోలతోనే తనకు పోటీ అంటున్న నివేద థామస్!
జెంటిల్ మ్యాన్ చిత్రంతో నివేదా థామస్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే అద్భుతమైన నటన కనబరచడంతో మంచి అవకాశాలు అందుకుంటోంది. నిన్నుకోరి. జైలవకుశ లాంటి చిత్రాల్లో నటించి విజయాలు దక్కించుకుంది. నివేద గ్లామర్ రోల్స్ లో నటించకున్నా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతున్నాయి. నివేద రీసెంట్ గా నటించిన చిత్రం 118. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నివేద కీలక పాత్రలో నటించింది.
118 చిత్రం మంచి టాక్ తో విజయం దిశగా దూసుకుపోతోంది.ప్రస్తుతం నివేద థామస్ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో హీరోయిన్ల మధ్య ఉన్న పోటీ గురించి మాట్లాడుతూ.. తాను ఏ హీరోయిన్ తోనూ పోటీ పడడం లేదని నివేద తెలిపింది. హీరోలతోనే నా పోటీ అని తెలిపింది. హీరోల తరహాలో కష్టమైన పాత్రల్లో నటించాలని ఉన్నట్లు నివేద తెలిపింది. ఎలాంటి పాత్రలో అయినా నటించగలిగే సత్తా ఉందని నివేద తెలిపింది.

నివేదిత ట్యాలెంట్ ని దర్శకులు గుర్తిస్తే ఆమెకు లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా అవకాశం దక్కుతుంది. తమిళంలో పాపనాశం చిత్రంలో కమల్ కుమార్తెగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎప్పటికైనా తనని హీరోలతో పోల్చే స్థాయికి ఎదుగుతానని నివేద ధీమా వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications











