Nivetha Thomas: వామ్మో నివేదా థామస్ ఏంటి.. ఇలా అయిపోయింది.. ఊహించని విధంగా ఉబ్బినట్లు..

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న వారిలో నివేదా థామస్ ఒకరు. ఎక్కువగా ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్స్ గ్లామరస్ పాత్రలతోనే క్రేజ్ పెంచుకోవాలని అనుకుంటున్నారు. కానీ అలా కాకుండా కేవలం యాక్టింగ్ స్కిల్స్ తోనే ఈ బ్యూటీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ గా ఉండే కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. అయితే మొన్నటి వరకు కాస్త నార్మల్ గానే కనిపించిన నివేదా థామస్ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా ఉబ్బి పోయినట్లు లావుగా మారిపోయింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

టాలెంటెడ్ హీరోయిన్స్

టాలెంటెడ్ హీరోయిన్స్

ఎక్కువగా గ్లామరస్ పాత్రలు చేయకపోయినప్పటికీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాలతోనే వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటూ ఉంటారు. మలయాళం నుంచి వచ్చిన హీరోయిన్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అనుపమ పరమేశ్వరన్ సాయి పల్లవి అలాగే నివేత థామస్ కూడా మంచి టాలెంటెడ్ హీరోయిన్స్ గా తెలుగు చిత్ర పరిశ్రమలు స్థిరపడిపోయింది.

వరుసగా సినిమాలు

వరుసగా సినిమాలు

నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మెన్ సినిమా ద్వారా తెలుగుతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది ఆ తర్వాత నిన్ను కోరి సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో కూడా నటించి మరో రేంజ్ కు వెళ్ళింది. అయితే ఈ బ్యూటీ మంచి సక్సెస్ అందుకున్న తర్వాత తొందరపడకుండా కంటెంట్ ఉన్న సినిమాలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పవన్ సినిమాలో

పవన్ సినిమాలో

కళ్యాణ్ రామ్ 118, బ్రోచేవారెవరు వంటి సినిమాలు కూడా నివేదకు మంచి గుర్తింపునందించాయి. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తీసుకొని చేసిన వకీల్ సాబ్ సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో కనిపించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం ఇండస్ట్రీలో కూడా ఈ బ్యూటీ వరుసగా అవకాశాలు అయితే అందుకుంటుంది.

శాకిని డాకిని

శాకిని డాకిని

ఇక త్వరలోనే నివేదా థామస్ తెలుగులో షాకిని డాకిని అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెజినా కసాండ్రా కూడా మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఇక వరుసగా సినిమా ప్రమోషన్స్ లో వీరిద్దరు కూడా బిజీ బిజీగా కనిపిస్తున్నారు. తప్పకుండా సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది అనే ధీమాతో ఉన్నారు.

చబ్బీ లుక్స్

అయితే మొన్నటి వరకు కాస్త నార్మల్ గానే కనిపించిన నివేదా థామస్ ఇప్పుడు మాత్రం ఒక్కసారి ఉబ్బి పోయినట్టు చాలా చబ్బీగా కనిపిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది. నివేత రీసెంట్ గా సోషల్ మీడియాలో తన తమ్ముడితో చేసిన ఒక డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. ఇక అందులో ఆమె ప్యాంటు షర్టులో చాలా ఉబ్బినట్లుగా అనిపిస్తోంది. ఇక్కడ డ్రెస్ లో అలా కనిపిస్తుందా లేదంటే నిజంగానే అంత లావుగా మారిపోయిందా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X