ఒకేఒక్కడు.. ప్రపంచం తెలుసుకోవాల్సిన మనిషి.. ఆయనే మా నాన్న అంటోన్న నివేదా థామస్
నివేదా థామస్.. అందానికి అడ్రస్ మాత్రమే కాదు.. నటనకు మారుపేరు. చేసింది తక్కువ సినిమాలే కావచ్చు కానీ.. వచ్చిన గుర్తింపు మాత్రం చాలా ఎక్కువ. మధ్యలో చదువు కోసం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నివేదా.. మళ్లీ చకాచకా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తోంది.

బ్రోచేవారెవరుతో మంచి హిట్...
నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మెన్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీలో నివేదా నటనకు మాత్రమే.. కాదు ఆమె స్టైలింగ్, లుక్స్‌కు యూత్ ఫిదా అయిపోయారు. నిన్నుకోరి, జైలవకుశ, 118, బ్రోచేవారు లాంటి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

రజినీ సినిమాలో అవకాశం..
ఏ ఆర్ మురుగదాస్, రజినీకాంత్ కాంబినేషన్‌లో రాబోతోన్న దర్భార్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లీకవుతోన్న పోస్టర్స్, చిత్రయూనిట్ అధికారికంగా రిలీజ్ చేస్తోన్న వర్కింగ్ స్టిల్స్ మూవీపై హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో నయన తార హీరోయిన్‌గా నటిస్తోండగా.. నివేదా థామస్ ఓ ప్రముఖ పాత్రను పోషిస్తోంది.

రజినీ కూతురి పాత్రలో...
ఈ కథలో సూపర్ స్టార్ రజినీ కూతురుగా నివేదా నటిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేస్తూ.. ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది.. ఒకే ఒక్కడు.. అతనే మా నాన్న.. ఆదిత్య అరుణాచలం.. అంటూ తెలిపింది. దీంతో సినిమాలో ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లే తెలుస్తోంది. మరి నివేదా నాన్న గురించి తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
శరవేగంగా షూటింగ్..
దర్బార్ చిత్ర షూటింగ్‌ను ఫుల్ స్పీడ్‌లో కానిచ్చేస్తోన్న యూనిట్.. వచ్చే సంక్రాంతికి బరిలోకి దిగేట్టు కనిపిస్తున్నాడు. అనిరుధ్ స్వరాలను అందిస్తుండగా.. వచ్చే నెలలో దర్బార్ థీమ్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ సినిమా తరువాత రజినీ తన తదుపరి చిత్రాన్ని కూడా ఫిక్స్ చేశాడు. శివ దర్శకత్వంలో సన్ నెట్వర్క్ ఆ చిత్రాన్ని తెరకెక్కించనుంది.


Click it and Unblock the Notifications











