మాటల్లేవ్.. ‘వకీల్ సాబ్’ను వీక్షిస్తోన్న నివేదా థామస్
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రేక్షకులు, అభిమానులు, సెలెబ్రిటీలు అందరూ కూడా వకీల్ సాబ్ మానియాలోనే ఉంటున్నారు. ఇక నివేదా థామస్ కూడా వకీల్ సాబ్ ధ్యాసలోనే ఉంది. కరోనా పాజిటివ్ రావడంతో వకీల్ సాబ్ ప్రమోషన్స్‌లో ఎక్కడా కూడా పాలుపంచుకోలేదు. కరోనా వల్ల వకీల్ సాబ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఇక ఇన్ని రోజులు క్వారంటైన్‌లో ఉన్న నివేదా థామస్ బయటకు వచ్చింది. బయటకు వచ్చాక ఫ్యాన్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. తాను క్షేమంగానే ఉన్నాను అని, మీరు చూపించే ప్రేమకు థ్యాంక్స్ అంటూ అభిమానులను ఉద్దేశించి నివేదా థామస్ నిన్న ఓ పోస్ట్ చేసింది. అలా నిన్న నివేదా థామస్ పోస్ట్ చేసిందో లేదో నేడు వకీల్ సాబ్ కోసం బయటకు అడుగుపెట్టేసింది.

ఓ థియేటర్‌లో ఓ మూలన నిలబడి వకీల్ సాబ్ సినిమాను, తన పాత్రకు వస్తోన్న రెస్పాన్స్ చూసి మురిసిపోతోంది. ఇలాంటి క్షణాలే నాకు కావాల్సింది.. మాటల్లేవ్ అంటూ నివేదా థామస్ ఎమోషనల్ అయింది. వకీల్ సాబ్ సినిమాను చూస్తోన్న నివేదా థామస్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి వకీల్ సాబ్ ప్రభంజనానికి రికార్డులు బద్దలవుతున్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ దుమ్ములేపే కలెక్షన్లుకొల్లగొట్టినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











