సెక్సీ, హాట్ అని పిలిచేవారు.. డైరెక్టర్లు, హీరోలు వెంటపడ్డారు..సీక్రెట్స్‌ను బయటపెట్టిన నగ్నం బ్యూటీ
లాక్ డౌన్ సమయంలో ఆర్జీవీ వదిలిన ఆటంబాంబ్ స్వీటీ (శ్రీ రాపాక). నగ్నం సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇక్కడ కరోనా కంటే ఎక్కువగా శ్రీ రాపాక ఫేమస్ అవుతోంది. బోల్డ్ ఇంటర్వ్యూలతో యూట్యూబ్‌లో శ్రీ రాపాక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్‌గా ఉంటూ వస్తోన్న శ్రీ.. నగ్నం సినిమాతోనే ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. ఇంత అందాన్ని చూసిన ప్రేక్షకులు సాధారణంగానే కొన్ని అనుమానాలు వస్తాయి. ఇండస్ట్రీలో ఎవ్వరూ ఆమెకు ప్రపోజ్ చేయలేదా? ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవా? అనే ప్రశ్నలకు శ్రీ.. ఓ ఇంటర్వ్యూలో అసలు సంగతులను చెప్పుకొచ్చింది.

చిన్నప్పటి నుంచి అంతే..
స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడే ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయని అవన్నీ తన లైఫ్‌లో కామన్ అని చెప్పుకొచ్చింది. తన థైస్ మీద ఉండే పుట్టుమచ్చకు ఎంతో మంది పడిపోయారని, స్కూల్‌లో షాట్ వేసుకుని స్పోర్ట్స్ అడేదాన్ని అలా ఎంతో మంది పడిపోయారని తెలిపింది. తన పిల్లికళ్లు, పెదవులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని పేర్కొంది.

సమంత, మాధవిలా ఉన్నారని..
తాను సమంత, నాటి హీరోయిన్ మాధవిలా ఉన్నాన్నని ఇలా ఎందరో తమకు నచ్చినట్టుగా అనేవారని పేర్కొంది. అయితే ఆర్జీవీ కూడా మొదటగా చూసినప్పుడు హీరోయిన్ మాధవిలా ఉన్నానని అన్నాడని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోనూ చాలా ప్రపోజల్స్ వచ్చాయని తెలిపింది.

సెక్సీ, హాట్ అనేవారు..
తనను సెక్సీ డిజైనర్, హాట్ డిజైనర్ అని డైరెక్లర్లు పిలిచేవారని చెప్పుకొచ్చింది. అయితే అది తాను కాంప్లిమెంట్‌గానే తీసుకుంటానని, తాను అంత అందంగా ఉన్నాను కాబట్టి అలా పిలిచేవారు. దాంట్లో తనకేమీ ఇబ్బంది అనిపించలేదని చెప్పుకొచ్చింది.

డైరెక్టర్లు, హీరోల ప్రపోజల్స్..
తాను ఫ్యాషన్ డిజైనర్‌గా ఇండస్ట్రీలో ఎంతో కాలం నుంచి ఉన్నానని, అయితే చాలా మంది డైరెక్టర్లు, హీరోలు తన వెంటపడ్డారని, పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టారని తెలిపింది. అయితే వారి పేరు ఇప్పుడు చెప్పనని ఎందుకుంటే వారికి పెళ్లి అయిపోయింది.. మళ్లీ గొడవలు పెట్టడం ఎందుకని నవ్వేసింది.

అలాంటి వాడు కావాలి..
తన ఫ్రెండ్స్ కూడా జెలసీ ఫీలయ్యేవారని, అబ్బా ఏం ఫిజికే అనేవారని చెప్పుకొచ్చింది. ఇక నీ లాంటి భార్య కావాలని ఎంతో మంది స్నేహితులే అన్నారని తెలిపింది. అయితే తనకు షాపిద్ కపూర్ లాంటి వాడు కావాలని, భార్యను కూడా ఎంత కేరింగ్‌గా చూసుకుంటాడని పేర్కొంది. హైట్, పర్సనాలిటీ బట్టి చూస్తే ప్రభాస్ బాగుంటాడని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని తెలిపింది.


Click it and Unblock the Notifications











