ఆ హీరోతో సమంత బోల్డ్ లిప్ లాక్.. రొమాంటిక్ బెడ్ సీన్స్.. క్లారిటీ వచ్చేసింది!
సమంత ఇటీవల కాలంలో కాస్త గ్లామర్ డోస్ పెంచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పుష్ప సినిమా ఐటెమ్ సాంగ్ నుంచి స్టన్ అయ్యేలా షాక్ ఇస్తోంది. ఆమె సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా తన వయ్యారాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇక ఆమె ఎలాంటి పాత్ర చేసినా కూడా అందులో ప్రాణం పెట్టి నటిస్తుంది అని చాలాసార్లు రుజువు చేసింది.
అయితే ఇటీవల సమంత మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వచ్చింది. ఆమె లిప్ లాక్ సీన్ తో పాటు బెడ్ సీన్స్ లో కూడా రొమాంటిక్ గా నటించింది అని రూమర్స్ వచ్చాయి. ఇక మొత్తానికి ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ వివరాల్లోకి వెళితే...

బిజీబిజీగా సమంత: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో ఇటీవలే వచ్చి అట్టర్ ప్లాప్ గా నిలిచింది శాకుంతలం సినిమా. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దర్శక, నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చింది. అయితే ఈ బాధ నుంచి కోలుకుంటే సమంత తన తదుపరి చిత్రాలతో దృష్టి పెట్టింది. ఓ వైపు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తూనే మరో వైపు సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతోంది

చాలా బోల్డ్ గా కనిపించారు: హిందీ హీరో వరుణ్ ధావన్ కు జోడీగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ తీసిన సిటాడెల్ కు ఇది ఇండియన్ వెర్షన్. అమెరికన్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా చేశారు. అయితే ఆమె అందులో చాలా బోల్డ్ గా కనిపించారు. అలాంటి సీన్లు చేసేందుకు తాను చాలా ఇబ్బంది పడినట్లు కూడా ప్రియాంక చోప్రా తెలిపారు.

ప్రియాంక అలా చెప్పడంతో: అయితే చిత్రీకరణ సమయంలో తనకు రిచర్డ్ చాలా సపోర్ట్ చేసినట్లు కూడా వెల్లడించింది. కెమెరాకు ఆమె బాడీ పార్ట్స్ కనిపించకుండా చేతులు అడ్డంగా పెట్టుకున్నట్లు వివరించింది. సినిమాల్లో తక్కువ కానీ వెబ్ సిరీస్ లలో ఇలాంటి సీన్లు చాలానే ఉంటున్నాయని, జనాలు కూడా వీటిని చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ప్రియాంక చెప్పుకొచ్చింది.

సమంత కూడా ఆ సీన్స్ లో: ఇక ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నుంచి స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ఇండియన్ వెర్షన్ లోను బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని అంతా భావించారు. లిప్ లాక్ సీన్స్ బెడ్ సీన్స్ లో ఆమె సామ్ ప్రియాంక చోప్రాను మరిపించేలా నటిస్తుందా అని కూడా అన్నారు. సమంతను అంత బోల్డ్ గా చూడడానికి ఎవరూ ఇష్ట పడరని కూడా కొంతమంది కామెంట్లు చేశారు. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం.

అసలు క్లారిటీ ఇది: వార్తా ఛానెళ్లు, టీవీలు, పేపర్లో వచ్చిన ఈ వార్తలను సమంత టీమ్ కొట్టి పడేసింది. ఇలాంటి సీన్లు ఇండియన్ వెర్షన్ లో ఉండవని చెప్పింది. బోల్డ్ సన్నివేషాలు సిటాడెల్ వెర్షన్ లో లేవని ఒక్క మాటలో తేల్చి చెప్పింది. సిటాడెల్ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేధికగా స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











