సూపర్‌స్టార్ కుమార్తెతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి విభేదాలు.. హీరోయిన్ షాకింగ్ రియాక్షన్

చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య అభిప్రాయ భేదాలు సహజమే. హేమాహేమీలు వంటి స్టార్స్ మధ్య కొన్నేళ్ల పాటు కోల్డ్ వార్ నడిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి ఉదంతాలెన్నో. హీరోలకు హీరోలకే కాదు.. హీరోయిన్ల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులను చిత్ర పరిశ్రమ చూసింది. అయితే అసలు ఎలాంటి గొడవలు లేకుండా కేవలం మీడియా, ప్రత్యర్ధులు సృష్టించిన విభేదాలు కూడా ఉన్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌, సారా అలీఖాన్, వామికా గబ్బి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయంటూ బాలీవుడ్‌లో ఊహాగానాలు వినిపిస్తుండగా దీనిపై సారా, రకుల్‌లు స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ సూపర్‌స్టార్ సైఫ్ అలీఖాన్ వారసురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు సారా అలీఖాన్. 2018లో కేదార్‌నాథ్ మూవీతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన సారా.. తర్వాత సింబా, అత్రాంగి రే, జర హట్కే జర బచ్కే, మెట్రో ఇన్ దినో, స్కై ఫోర్స్ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అటు రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. దక్షిణాదిలో అగ్రనటిగా స్టార్‌డమ్ చూసింది. నాగార్జున, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది.

No Rift Between Rakul Preet Singh Sara Ali Khan and Wamiqa Gabbi Actresses Clarify Rumours

అయితే ఊహించని విధంగా తెలుగు, తమిళ్ భాషల్లో ఫ్లాప్స్ ఎదురుకావడంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాలలో నటించి మెప్పిస్తోంది. ఈలోగా తన ప్రియుడు జాకీ భగ్నానీతో ప్రేమాయణానికి ఎండ్ కార్డ్ పెట్టేసి పెళ్లి చేసేసుకుంది. వివాహం అయినప్పటికీ నటనను కొనసాగిస్తూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. సాలీడ్ హిట్ కొట్టి బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ భావిస్తున్నారు.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, వామికా గబ్బిలు పతీ పత్ని ఔర్ వో దో. బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖొరానా హీరోగా నటిస్తున్నారు. టీ సిరీస్- బీఆర్ స్టూడియోస్‌ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా, కృషన్ కుమార్‌లు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ముదసర్ అజీజ్ దర్శకత్వ వహిస్తున్నారు. విజయ రాజ్, విశాల్ వశిష్ట, దుర్గేష్ కుమార్, దీపిక అమీన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రాఫర్‌గా, నినాద్ ఖాన్లోకర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా 8 మంది సంగీత దర్శకులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 15న పతీ పత్ని ఔర్ వో దో మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

అయితే రకుల్, సారా, వామికా గబ్బీలకు సెట్‌లో అస్సలు పడటం లేదని కొందరు... సారా, రకుల్ కలిసి వామికను దూరం పెడుతున్నారని మరికొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. వీటిపై సారా అలీఖాన్ స్పందించారు.. రకుల్, వామికలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. కొందరు మా మధ్య గొడవలు ఉన్నట్లుగా సృష్టిస్తున్నారు. మేం సెట్‌లో ఒకే కుటుంబంలా ఉంటాం. రకుల్, వామికాలు బాగా నటిస్తే నాకు కూడా ప్లస్ అవుతుందని సారా తేల్చేశారు. అటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా వామిక, సారా అలీఖాన్‌లతో తనకు ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. అనవసరమైన గొడవలు పెట్టుకుంటే ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే అదే నిజమని నమ్ముతారు.. మీడియా అదే పని చేస్తుంది. మేమంతా సినిమా కోసం నూటికి నూరు శాతం కష్టపడి పనిచేస్తాం, అంతేకానీ చిన్నపిల్లల గొడవల గురించి పట్టించుకోమని రకుల్ తెలిపారు. మరి ఈ ముద్దుగుమ్మల స్పందనతో ఈ వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X