చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్.. మాట ఇచ్చి కూడా వెళ్లకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్!
బాలీవుడ్ హీరో శత్రుజ్ఞ సిన్హా వారసురాలుగా ఎంట్రీ హీరోయిన్ సోనాక్షి సిన్హా వరుస హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీ జీవితాన్ని గడుపుతుంది. 2010లో తన కెరీర్ ప్రారంభించిన ఆమె తొలి సినిమా సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్'తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా ఆమె అనుకోకుండా చిక్కుల్లో పడింది. ఆ వివరాల్లోకి

2019లో ఎఫ్‌ఐఆర్
డబ్బు తీసుకున్నా ఒక కార్యక్రమానికి హాజరు కానందుకు సోనాక్షి సిన్హాపై ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని ఏసీజేఎం కోర్టు వారెంట్ జారీ చేసింది. ఏప్రిల్ 25న కోర్టులో హాజరు కావాలని సోనాక్షి సిన్హాని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సోనాక్షిపై ఫిబ్రవరి 2019లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మొరాదాబాద్‌లోని కట్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివపురి నివాసి అయిన ప్రమోద్ శర్మ 'ఇండియా ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డ్' పేరుతో ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థను నడుపుతున్నాడు.

సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో
సోనాక్షి సిన్హా మరియు ఆమెతో సంబంధం ఉన్న ఈవెంట్ కంపెనీలు ఆయనని 37 లక్షలు మోసం చేశాయట. ఇదే కేసులో, ఫిబ్రవరి 2019లో, విచారణ తర్వాత, నిందితులపై చీటింగ్ కేసును కట్ఘర్ పోలీసులు నమోదు చేశారు. ప్రమోద్ శర్మ ప్రకారం, సెప్టెంబర్ 30 న, అతని ఈవెంట్ కంపెనీ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో ఇండియా ఫ్యాషన్ మరియు బ్యూటీ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించింది.

నాలుగు వాయిదాల్లో
ఈ ఈవెంట్ కు సోనాక్షి అతిథిగా హాజరై అవార్డులు ప్రదానం చేయాల్సి ఉంది. ఆమెను పిలవడానికి టాలెంట్ ఫుల్‌ఆన్ కంపెనీ అలాగే ఎక్సీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆపరేటర్ అభిషేక్ సిన్హాను సంప్రరించారట. ఆ ఏడాది జూన్‌లో సోనాక్షి సిన్హాకు నాలుగు వాయిదాల్లో మొత్తం రూ.28 లక్షల 17 వేలు చెల్లించారు. టాలెంట్ ఫుల్‌ఆన్ కంపెనీకి ఐదు లక్షల రూపాయల కమిషన్ కూడా ఇచ్చారు.

ఏమాత్రం నిజం లేదని
ఆర్టీజీఎస్ ద్వారా ఈ మొత్తం ఆన్‌లైన్‌లో ఇచ్చారు. దీని తరువాత, జూన్ 21న, సోనాక్షి రాక కోసం అభిషేక్ ఈవెంట్ కంపెనీ అతనితో లిఖితపూర్వక ఒప్పందం చేసుకుంది. దీని తర్వాత సోనాక్షి ఢిల్లీలో జరగనున్న ఈవెంట్‌కి సంబంధించిన ప్రచార వీడియోలను కూడా విడుదల చేసింది, అయితే ఏమయిందో ఏమో నటి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే ఈ కేసు నమోదు విషయం మీద గతంలో సోనాక్షి ట్వీట్ చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్ నిబద్ధతతో లేడని, మీడియా ద్వారా తన పేరును ఉపయోగించి డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు. అధికారుల పూర్తి సహకారం కూడా నావైపే ఉంది. ఆ వ్యక్తి వాదనలో ఏమాత్రం నిజం లేదని తెలియజేస్తున్నా.. అంటూ ట్వీట్ చేసింది.

6 నెలలకు పైగా సమయం
అయితే ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది పికె గోస్వామి తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసు నమోదు విషయంలో సోనాక్షి సిన్హా ఈ వ్యవహారంపై హైకోర్టు స్టే తీసుకుంది. అలా 6 నెలలకు పైగా సమయం గడిచింది. ఇక సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం, స్టే 6 నెలల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది, ఆ తర్వాత క్లియర్ అయిపోతుంది. అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మొరాదాబాద్‌లోని ఏసీజేఎం కోర్టు సోనాక్షి సిన్హాపై వారెంట్ జారీ చేసింది. న్యాయవాది పికె గోస్వామి ప్రకారం, ఇప్పుడు సోనాక్షి సిన్హా ఈ కేసులో మొరాదాబాద్ కోర్టుకు హాజరుకావలసి ఉంటుంది, ఆ తర్వాత ఆమెకు బెయిల్ వస్తుందా లేదా కోర్టు నిర్ణయం ప్రకారం జైలుకు వెళ్లాల్సి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











