Nora Fatehi: అంతా ఉచితంగానే.. ఆ పని చేయమని బలవంతం.. ఐటెం బ్యూటీ ఎమోషనల్

Nora Fatehi: నోరా ఫతేహి (Nora Fatehi) గురించి సినీ లవర్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిన మూవీ బాహుబలిలో 'మనోహరి' అనే స్పెషల్ పాటలో తన అందచందాలతో అట్రాక్ట్ చేసింది. ఈ హాట్ బ్యూటీ కేవలం నటి మాత్రమే కాదు.. గుడ్ డ్యాన్సర్‌, సింగర్‌ అండ్ మోడల్‌​ కూడా. ఈ భామ తెలుగు టెంపర్, బాహుబలి సినిమాల్లో తన ఐటెం సాంగ్ చేసి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా నోరా ఫతేహి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న పరిస్థితి గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఐటెం బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi)ను మూవీ లవర్స్ కంటే.. డ్యాన్స్‌ లవర్లకు పరిచయం అవసరం లేని పేరు. ఆమె పలు రియలిటీ షోకు జడ్జిగా కూడా వ్యవహరించి.. తనదైన ముద్ర వేసుకుంది. మొరాకో, కెనడా కుటుంబానికి చెందిన నోరా పుట్టి,పెరిగిందంతా కెనడాలోనే. బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన తరువాత ఇండియాలోనే సెటిల్ అయ్యింది. ఈ అమ్మడు .. రోర్... టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత టాలీవుడ్ లో టెంపర్, బాహుబలి, టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి...క్రేజీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక శాండిల్ వుడ్ తో కూడా అడుగు పెట్టిన ఈ అమ్మడు 'డబుల్ బ్యారెల్', 'కయంకుళం కోచున్నీ' చిత్రాల్లో నటించింది. ఇక 2016లో బిగ్ బాస్ 9లో కూడా పాల్గొంది.

Nora Fatehi Claims She Did satyamev jayate Dilbar And stree kamariya For Free T-Series And Maddock Wasn t Paid

ప్రభాస్‌ బాహుబలి సినిమాలో 'మనోహరి'పాట మాత్రం ఆమెకు ఎనలేని క్రేజ్ తెచ్చి పెట్టింది. అలాగే.. దిల్ బర్, సాకీ సాకీ లాంటి స్పెషల్ సాంగ్స్ తో బీ-టౌన్ లో యూబ్యూట్ లో కూడా పలు రికార్డులను క్రియేట్ చేసున్నాయి. హైయ్యెస్ట్ వ్యూస్స్ అందుకున్న వీడియోస్ గా ఈ సాంగ్స్ నిలిచాయి. అంటే.. ఆమెకు ఎంత పాపులర్టీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే.. ' భుజ్'లో ఇండియన్ సీక్రెట్ స్పైగా లీడ్ రోల్ లో కనిపించింది. తన హాట్ అండ్ క్యూట్ నటనతో ప్రేక్షకుల మదిపోగొట్టింది. ఇటీవల టీ-సిరీస్‌తో డీల్ కుదుర్చుకుంది. టీ-సిరీస్ మూవీస్, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది.

నోరా ఫతేహి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నని తెలిపారు. 2018లో విడుదలైన 'దిల్బర్-దిల్బర్' పాటతో తనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ పాట కూడా చాలా సూపర్‌హిట్ అయింది. అయితే ఈ పాట కోసం తాను ఒక్క పైసా కూడా తీసుకోలేదని నటి నోరా ఫతేహి
స్వయంగా వెల్లడించింది. ఈ పాట మాత్రమే కాకుండా శ్రద్ధా కపూర్ -రాజ్‌కుమార్ రావు నటించిన 'స్త్రీ'లోని 'కమరియా' కోసం కూడా ఉచితంగా చేశానని తెలిపారు.

Nora Fatehi Claims She Did satyamev jayate Dilbar And stree kamariya For Free T-Series And Maddock Wasn t Paid

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో తనకు మంచి పేరు తెచ్చుకున్న ఈ రెండు బెస్ట్ పాట‌లను ఫ్రీగా చేశానన్నారు. ఇందులో 'సత్యమేవ్ జయతే'లోని 'దిల్బర్' పాట యూట్యూబ్‌లో ఒక బిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించారన్నారని తెలిపారు. తనకు డబ్బు చాలా అవసరం అని, అయితే ఆ సమయంలో డబ్బు సంపాదించడానికి తాను పని చేయలేదని చెప్పింది. 'దిల్బర్' పాట కోసం, స్టెప్పులు కోఆర్డినేట్ అయ్యేలా తానే వారం రోజుల పాటు డ్యాన్సర్లందరికీ శిక్షణ ఇచ్చానని నోరా చెప్పింది. తాను స్వయంగా ఈ పాటలలో చాలా మార్పులు చేశానన్నారు.

ఇక మూవీ మేకర్స్ గురించి మట్లాడుతూ.. ఈ పాటను డ్యాన్స్ ఓరియెంటెడ్ పాటగా మార్చవచ్చని, ఈ సాంగ్ షూటింగ్ సమయంలో తనకు మూవీ మేకర్స్ చాలా పొట్టి దుస్తులు ఇచ్చారని, అది తనకు ఏమాత్రం నచ్చలేదన్నారు. అదే విషయాన్ని చెప్పి.. తన కాస్ట్యూమ్స్ కూడా మార్పించుకున్నానని అన్నారు. కెరీర్ ప్రారంభంలో తాను ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చిందనీ, ఈ పాటల షూటింగ్‌లో అద్దెలు చెల్లించడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పింది.

తిండికి డబ్బులు డబ్బులు లేవని, అందుకే కేరీర్ ప్రారంభంలో చాలా సన్నగా ఉన్నానని చెప్పింది. ఆ సమయంలో తాను మోడలింగ్ ఏజెన్సీలతో కూడా పనిచేశానని తెలిపారు. దిల్బర్ పాట యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్ దాటాయనీ, అయితే ఆ సమయంలో తాను డబ్బు సంపాదించడం కంటే తనను తాను నిరూపించుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టానని తెలిపింది నోరా ఫతేహి .

More from Filmibeat

Read more about: nora fatehi satyamev jayate stree
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X