Don't Miss!
- News
నేడు బీఆర్ఎస్ లో భారీ చేరికలు -కేసీఆర్ తో వరుస భేటీలు..!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Jacqueline Fernandez పై నోరా ఫతేహి పరువు నష్టం దావా.. 200 కోట్ల కుంభకోణంలో మరో ట్విస్టు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సుకేష్ చంద్రశేఖర్ కుంభకోణం కేసులో మరో ట్విస్టు చోటుచేసుకొన్నది. దాదాపు 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లకు ఉన్న సంబంధాలు అందర్నీ షాక్‌కు గురి చేసింది. అయితే ఇప్పటికే పలు మార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) అధికారులు పలువురు సినీ తారలను విచారించారు. ఈ విచారణలో బాలీవుడ్ స్టార్స్ నోరా ఫతేహి, జాక్వలైన్ ఫెర్నాండేజ్ పేరు ప్రముఖంగా వినిపించాయి. ఒకవైపు విచారణ జరుగుతుండగానే... జాక్వలైన్‌పై నోరా ఫతేహి పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

200 కోట్ల మనీలాండరింగ్ కేసుతో జాక్వలైన్, నోరా
దేశంలోని పలువురు పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తూ.. భారీ ఎత్తున్న బలవంతపు వసూళ్లకు పాల్పడిన సుకేష్ చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తూ.. అక్కడి నుంచి ఫోన్‌లో తాను అమిత్ షా పీఏను అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దాదాపు 200 కోట్ల మనీలాండరింగ్ కేసుతో జాక్వలైన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహికి సంబంధాలు ఉన్నట్టు అనుమానించారు. సినీ తారలకు భారీగా బహుమతులు, విలాసవంతమైన గిఫ్టులు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో వారిని పలుమార్లు విచారించారు.

నా ప్రతిష్టకు భంగం
నోరా ఫతేహి తన ఫిర్యాదులో.. సుకేష్ చంద్రశేఖర్ కేసులో విచారణ జరుగుతున్న సమయంలో తనకు వ్యతిరేకంగా మీడియాలో జాక్వలైన్ దుష్ప్రచారం చేస్తున్నది. జాక్వలైన్ మీడియాకు రకరకాల సమాచారం అందిస్తున్నది. దాని వల్ల నా ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో వచ్చిన అవకాశాలు చేజారినట్టు అనిపించాయి. ఇలాంటి ప్రచారం వల్ల నాతో సరిపడని వాళ్లు నన్ను ఇంకా బ్లేమ్ చేస్తారు అని నోరా ఫతేహి తన పరువు నష్టం దావా పిటిషన్‌లో తెలిపింది.

జాక్వలైన్ ఫెర్నాండేజ్‌పై ఆగ్రహం
సుకేశ్
చంద్రశేఖర్‌కు
సంబంధించి
200
కోట్ల
కేసులో
తనను
జాక్వలైన్
ఫెర్నాండేజ్
లాగడంపై
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
ఈ
కేసులో
తనను
లాగి
తన
ప్రతిష్టను
మసకబార్చింది.
అందుకే
తాను
జాక్వలైన్
ఫెర్నాండేజ్‌పై
పరువు
నష్టం
దావా
వేస్తున్నట్టు
నోరా
ఫతేహి
వెల్లడించారు.ఈ
మేరకు
తన
లాయర్
ప్రశాంత్
పాటిల్
ద్వారా
నోటీసులు
జారీ
చేశారు.
అయితే
నోరా
ఫతేహి
జారీ
చేసిన
నోటీసులపై
జాక్వలైన్
లాయర్
స్పందించారు.

నోరా ఫతేహి గురించి మీడియాలో
జాక్వలైన్
ఫెర్నాండేజ్
న్యాయవాది
ప్రశాంత్
పాటిల్
మాట్లాడుతూ..
నోరా
ఫతేహి
గురించి
ఎలక్ట్రానిక్
మీడియా
గానీ,
ప్రింట్
మీడియాలో
గానీ
ఎలాంటి
అభ్యంతరకరమైన
వ్యాఖ్యలు
చేయలేదు.
ఈడీ
విచారణలో
కూడా
నోరా
గురించి
అడిగిన
ప్రశ్నలను
జాక్వలైన్
దాటవేశారు.
ఇప్పటి
వరకు
సోషల్
మీడియా,
ప్రింట్
మీడియాలో
ఇతరులపై
ఆరోపణలు
చేయలేదు.
చట్టానికి
లోబడి
విచారణకు
హాజరయ్యారు
అని
అన్నారు.

మిస్ కమ్యునికేషన్ కారణంగానే..
నోరా
ఫతేహి
అంటే
నా
క్లయింట్
జాక్వలైన్
ఫెర్నాండేజ్‌కు
అమితమైన
గౌరవం
ఉంది.
ఒకరి
మధ్య
ఇంకొకరికి
మిస్
కమ్యునికేషన్
ఏర్పడింది.
అది
తొందర్లోనే
పరిష్కారం
అవుతుంది.
ఈ
కేసు
విచారణ
కోర్టు
పరిధిలో
ఉంది.
కాబట్టి
ఈ
విషయంపై
ఎక్కువగా
వివరణ
ఇవ్వడం
సరికాదు.
ఎవరి
ప్రతిష్టకు
భంగం
కలిగించడం
నా
క్లయిట్
జాక్వలైన్
ఉద్దేశం
కాదు
అని
ప్రశాంత్
పాటిల్
వివరణ
ఇచ్చారు.