ఆ నలుగురితోనే నిర్మాతలు.. మా లాంటి వాళ్లు పనికి రారా? నోరా ఫతేహి కామెంట్స్ వైరల్
బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో ఐటమ్, సాంగ్స్, పాత్రల్లో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ నోరా ఫతేహి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన స్ట్రీట్ డాన్సర్ అనే 3డి మూవీతో సినిమాల్లో ప్రవేశించింది. ఈ సందర్భంగా భవిష్యత్తులో తాను చేయబోతున్న సినిమాల గురించి మాట్లాడింది. అలాగే సినిమా పరిశ్రమలో తన తోటి హీరోయిన్ల గురించి ఎదురవుతున్న పోటీ గురించి మాట్లాడింది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో నిర్మాతలు అనుసరిస్తున్న తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
నన్ను కేవలం డ్యాన్సర్‌గా మాత్రమే చూడకూడదు. నన్ను డ్యాన్సర్‌గా మాత్రమే చూసి అవకాశాలు ఇవ్వడం లేదు. గతంలో లెజెండరీ హీరోయిన్లు గొప్ప డ్యాన్సర్లనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. డ్యాన్సర్లు కూడా మంచి నటనను ప్రదర్శిస్తారనే విషయాన్ని తెలుసుకోవాలి. గతంలో టాప్ హీరోయిన్లు పాటల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ.. ఫెర్ఫార్మెన్స్‌తో కూడా ఆకట్టుకొన్నారు అనే విషయాన్ని నోరా ఫతేహి అభిప్రాయపడ్డారు.

కేవలం డాన్స్ వేసేందుకు మాత్రమే కాకుండా.. నటించేందుకు తనను ఎందుకు తీసుకోవడం లేదు. సినిమాలో నటించే హీరోయిన్లకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో.. డాన్స్ చేయటం కూడా వారి పాత్రలో భాగమన్నారు. కేవలం ఐకానిక్ హీరోయిన్లు కూడా డ్యాన్సులతోపాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చారు.
తనకు వచ్చిన అవకాశాన్ని ఎవరికి ఇస్తారో చూడాలి. అందం, నటన నైపుణ్యాలు, ఉనికి, పాపులారిటీ, భాషా వ్యక్తీకరణ లాంటివి కూడా చేయగలను. అందుకే ఈ విషయంలో తనకు ముందుగా అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నా అని తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నోరా ఫతేహి వ్యాఖ్యలు చేశారు.
అలాగే సినిమా రంగంలో కోసం చాలా పోటీ ఉంది. చిత్ర నిర్మాతలు కేవలం నలుగురికి మాత్రమే ఒకదాని తర్వాత మరో అవకాశం ఇస్తున్నారు. ఇలా చిత్ర నిర్మాతలు అవకాశం ఇస్తుంటారే తప్ప బయట పరిస్థితులను ఆలోచించాలి కేవలం నలుగురు అమ్మాయిలకు అవకాశాలు ఇస్తే ఫిల్మ్ మేకర్స్ కు, సమాజంలో వారికి మాత్రమే గుర్తింపు ఉంటుంది. మిగతవారు కనుమరుగు అవుతారు అని నోరా ఫతేహి అన్నారు.

ఇప్పటికైనా ఆ నలుగురే (దీపిక, సారా ఆలీ ఖాన్, జాన్వీ కపూర్, ఆలియాభట్) కాకుండా.. ఇక మిగితా వారికి కూడా అవకాశం వచ్చేలా చూడాలి. ఈ నిర్ణయం ఆలస్యమైనా, పని కష్టమైనా ఎదో ఒక రోజు తప్పకుండా జరుగుతుంది. అపుడు తనని తాను నిరూపించుకుంటారు. 100 పర్సంట్ చిత్రంలో తాను పూర్తి స్థాయిలో నటించనున్నాను. ఈ చిత్రంలో రితిష్ దేశముఖ్, షెహనాజ్ గిల్ నటించనున్నారు. సాజిద్ ఖాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అని నోరా ఫతేహి చెప్పారు.


Click it and Unblock the Notifications











