‘ఏ హీరోయిన్‌నైనా వదిలిపెట్టావా? నీ వల్ల బతికి బయటపడ్డారా?’

సినిమా రంగంలో అఫైర్లు, డేటింగ్స్, లివింగ్ రిలేషన్‌షిప్స్ కామన్ అయిపోయాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరోల వరకు.. లేత సొగసుల బ్యూటీ నుంచి సీనియర్ల వరకు ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తుంటాయి. ఇక యువ హీరోల విషయానికి వస్తే.. వారి శృంగారలీలలు,డేటింగ్ కథలు లెక్కలేనంతగా ఉంటాయి. బాలీవుడ్ ఒక్కో సమయంలో ఒక హీరో రొమాంటిక్‌గా.. అమ్మాయిల కలల రాజుగా ఉంటారు. అయితే ప్రస్తుతం హిందీ సినిమా రంగంలోని యువ హీరోల్లో ఒకరైన కుర్ర హీరోకు అలాంటి ఇమేజ్‌ ఉంది. ఆ హీరోను ముఖం పట్టుకొని బాలీవుడ్ శృంగార నటి నోరా ఫతేహి కడిగిపడేసింది. ఆ హీరో ఎవరు? ఎంత మందితో అఫైర్లు కొనసాగించారంటే..

ప్రస్తుతం హిందీ సినిమా రంగంలో హాట్ హీరో కార్తీక్ ఆర్యన్ మంచి ఊపు మీద ఉన్నారు. వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ హీరోగా టాప్ రేంజ్‌లో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన భూల్ భులయ్యా 3 ఘన విజయం సాధించింది. ఇక ఆషికీ 3 సినిమాతో మంచి విజయం సాధించేందుకు ఉరకలు వేస్తున్నాడు. అయితే ఈ యంగ్ హీరోకు ఇండస్ట్రీలోని యువ హీరోయిన్లకు లింకులు పెడుతూ కథనాలు ఎక్కువగానే బాలీవుడ్ మీడియాలో వినిపించాయి.

Nora Fatehi questions Karthik Aryan

కార్తీక్ ఆర్యన్‌తో అఫైర్ లింక్ వార్తలు వచ్చిన మొదటి హీరోయిన్ సారా ఆలీ ఖాన్. లవ్ ఆజ్ కల్ 2 సినిమా షూటింగులో సారా ఆలీ ఖాన్‌తో అతి సన్నిహితంగా,చనువుతో తిరగడంతో వారిద్దరి మధ్య అఫైర్ కొనసాగుతుందనే విషయం మీడియాలో ప్రచారమైంది. కానీ ఆ గాసిప్ ఎక్కువ కాలం మీడియాలో నిలబడలేదు. ఆ తర్వాత జాన్వీకపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దోస్తానా 2 సినిమా షూటింగ్‌లో వారిద్దరూ దగ్గిమరయ్యారు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. దోస్తానా 2 సినిమాతోనే వారి అఫైర్‌కు తెరపడింది.

ఆ తర్వాత అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేసింది. పతి పత్ని ఔర్ ఓ సినిమా చిత్రీకరణ సమయంలో వారిద్దరూ లవ్‌లో పడ్డారనే విషయం గురించి మీడియాలో గుసగుసలు వినిపించాయి. వారిద్దరి మధ్య ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ గురించి కథనాలు, ముచ్చట్లు మీడియా హెడ్‌లైన్లను ఆకర్షించాయి. ఆ తర్వాత బాలీవుడ్ యువ హీరోయిన్లు డింపుల్ శర్మ, నుస్రత్ బరుచా, తారా సుతారియా అలాంటి హీరోయిన్లతో లింకులు పెడుతూ కథనాలు వచ్చాయి.

ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ ఆషికీ 3 చిత్రంలో నటిస్తున్నారు. ఆయనతో తెలుగు అందాల తార శ్రీలీల నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఆషికీ 3 సినిమా షూటింగులో వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్ ఇంటిలో జరిగిన ఫంక్షన్‌కు శ్రీలీల వెళ్లడం, అక్కడ కలిసి డ్యాన్సులు చేయడం వైరల్ అయింది. అయితే డాక్టర్ కొడలు అంటూ కార్తీక్ ఆర్యన్ తల్లి అనడంతో వారి మధ్య అఫైర్ కొనసాగుతుందని ఓ క్లారిటీ వచ్చేసింది.

ఇలా యంగ్ హీరోయిన్లతో డేటింగ్, అఫైర్, లివింగ్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్న కార్తీక్ ఆర్యన్‌ను ఓ ఈవెంట్‌లో ముఖం ముందే బాలీవుడ్ హాట్ గర్ల్ నోరా ఫతేహి ఆయన యవ్వారాన్ని కడిగిపడేసింది. నీవు ఏ హీరోయిన్‌నైనా వదిలిపెట్టకుండా ఉన్నావా? నీ బారిన పడకుండా ఎవరైనా ఉన్నారా? అంటూ ముఖం మీదే అనడంతో కార్తీక్ ఆర్యన్ కూడా కంగు తిన్నాడు. గతంలో నోరా ఫతేహీతో కూడా మనోడు డేటింగ్ చేశారనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X