స్టార్ ప్రొడ్యూసర్‌తో ఎఫైర్? బాహుబలి బ్యూటీ షాకింగ్ రియాక్షన్..
ఇండస్ట్రీలో తారల మధ్య రిలేషన్‌షిప్ రూమర్లు కొత్తేమీ కాదు. కలిసి సినిమాలు చేయకపోయినా, ఒకే వేదికపై కనిపించినా లేదా ఒకే పార్టీలో పాల్గొన్నా చాలు.. డేటింగ్, అఫైర్ కథనాలు మీడియాలో హల్‌చల్ చేయడం సహజంగా మారింది. తాజాగా అలాంటి ఊహాగానాల్లో చిక్కుకున్నారు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్, ఐటెం భామ. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనీ, వీరిద్దరి మధ్య డేటింగ్ చేస్తున్నట్టు రూమర్లు గత కొద్దికాలంగా మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ రూమార్స్ పై ఆ స్టార్ బ్యూటీ షాకింగ్ రిప్లే ఇచ్చింది. ఇంతకీ ఆ ఐటెం బ్యూటీ ఎవరంటే?
ఆ స్టార్ ఐటెం బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి. కెనడాకు చెందిన నోరా ఫతేహి బాలీవుడ్‌లో మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మోడల్‌గా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా రాణించడమే కాకుండా 'ఐటెమ్ క్వీన్'గా పేరు సంపాదించింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె మొదటగా ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలోని స్పెషల్ సాంగ్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బాహుబలి, కిక్ 2 వంటి పాన్ ఇండియా సినిమాల్లో హాట్ స్పెషల్ నెంబర్స్‌తో అలరించింది. ఇలా నార్త్, సౌత్ ఇండస్ట్రీలలో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించింది.

ఇదిలా ఉండగా, టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో నోరా ఫతేహికి రిలేషన్ ఉందంటూ, వీరిద్దరి మధ్య అఫైర్ ఉందంటూ గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్లు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇంతకీ ఏమైందంటే.. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో నోరా ఫతేహికి రిలేషన్ ఉందంటూ ఐదేళ్ల క్రితం రెడిట్ వేదికగా మొదలైన ఒక థ్రెడ్ తాజాగా టిక్‌టాక్‌లో మళ్లీ వైరల్‌గా మారింది.
ఆ పాత పోస్ట్‌లో నోరా మెయింటైన్ చేస్తున్న ఖరీదైన లైఫ్‌స్టైల్, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ బ్యాగ్స్ వెనుక భూషణ్ కుమార్ హస్తం ఉందని, అందుకే ఆమెకు టీ-సిరీస్ బ్యానర్ నుంచి వరుసగా స్పెషల్ సాంగ్ అవకాశాలు వస్తున్నాయని ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ రూమర్లు పెద్దగా పట్టించుకోబడకపోయినా, ఇప్పుడు సోషల్ మీడియా రీషేర్‌లతో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
ఈ రూమర్స్ పై నోరా ఫతేహి తొలిసారి స్పందించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ టిక్‌టాక్ వీడియో కింద ఆమె కేవలం "Wow" అంటూ ఒక స్మైల్ ఎమోజీని జోడిస్తూ కామెంట్ చేసింది. ఎలాంటి వివరణ లేకుండా, నేరుగా ఖండించకుండానే ఇచ్చిన ఈ సింపుల్ కానీ సార్కాస్టిక్ రిప్లై నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు నెటిజన్లు 'ఇదే పర్ఫెక్ట్ అండ్ సాలిడ్ కౌంటర్'అంటూ నోరా ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు మాత్రం 'ఇలా స్పందించడం వల్లే పాత రూమర్లకు మళ్లీ హైప్ వస్తోంది' అంటూ విమర్శిస్తున్నారు.
ఇక నోరా కెరీర్‌ను గమనిస్తే దిల్‌బర్, ఓ సాకీ సాకీ, నాచే నాచే వంటి సూపర్ హిట్ స్పెషల్ సాంగ్స్‌తో ఆమె ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. మరోవైపు, నోరా ఫతేహి గతంలో మొరాకో ఫుట్‌బాల్ స్టార్ 'అచ్రాఫ్ హకీమి'తో డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు వినిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కన్నడ మూవీ KD:ది డెవిల్, తమిళ మూవీ కాంచన 4 వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
ఇక భూషణ్ కుమార్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్, ఆయన 2005లో నటి,దర్శకురాలు దివ్య ఖోస్లా కుమార్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. నోరాతో రిలేషన్‌షిప్ రూమర్లపై భూషణ్ కుమార్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











