‘నేను ఏ తప్పూ చేయలేదు.. ఆ విషయంలోకి నన్నెందుకు లాగుతున్నారు?' బాహుబలి బ్యూటీ ఆవేదన
Nora Fatehi : హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెనడాకు చెందిన ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ మోడల్‌గా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా, ముఖ్యంగా ఐటెం క్వీన్‌గా బాలీవుడ్‌లో దుమ్మురేపింది. తెలుగు ప్రేక్షకులకు మొదటగా ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ఐటెం సాంగ్‌తో పరిచయం అయిన నోరా, తరువాత బాహుబలి, కిక్ 2 వంటి పాన్ ఇండియా సినిమాల్లో కూడా హాట్ స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది. అయితే.. తాజాగా నోరా ఫతేహి పేరు ఓ వివాదం వినిపిస్తోంది. ఆమె పలు కథనాలు వస్తున్నాయి. దీంతో నోరా ఫతేహి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే?
తాజాగా నోరా ఫతేహి పేరు భారీ రూ. 252 కోట్లు విలువైన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ వ్యవహారంలో వినిపించడం సంచలనంగా మారింది. స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ఆమె తమ్ముడు సిద్ధాంత్ కపూర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఓర్రీ, దర్శకులు అబ్బాస్-ముస్తాన్, ర్యాపర్ వరుణ్ మథూర్ వంటి పలువురు హై ప్రొఫైల్ సెలబ్రిటీలు కూడా లగ్జరీ డ్రగ్ పార్టీలకు హాజరయ్యారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇదంతా అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సిండికేట్‌తో లింక్ అయి ఉన్నట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా దావూద్ ఇబ్రహీం లింక్ ఉన్న అక్రమ పార్టీ కేసులో తన పేరు లాగుతున్నారనే ప్రచారంపై బాలీవుడ్ స్టార్ నటి నోరా ఫతేహీ ఘాటు స్పందన ఇచ్చింది. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఎలాంటి ఆధారాలు లేకుండా తనను మళ్లీ టార్గెట్ చేయడం సహించబోనని నోరా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో లేఖరూపంలో వేసిన తన స్టేట్మెంట్‌తో నోరా క్లారిటీ ఇచ్చింది.
"నేను పార్టీలకు వెళ్లే వ్యక్తిని కాదు. నేను ఎప్పుడూ ఫ్లైట్స్‌లో ఉంటున్నా, షూటింగ్ సెట్స్‌లో ఉంటున్నా. నేను పర్సనల్ లైఫ్ కూడా లేని వర్క్‌హాలిక్‌ను. నా ఆఫ్‌డేస్‌లో దుబాయ్ బీచ్ దగ్గర లేకపోతే నా స్కూల్ ఫ్రెండ్స్‌తోనే ఉంటాను" అని నోరా చెప్పింది. ఇలాంటి వ్యక్తులతో (దావూద్ లింక్ ఉన్న వారితో) తనకు ఎలాంటి పరిచయం లేదని స్పష్టం చేసింది.
ఇక తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని నోరా ఆవేదన వ్యక్తం చేసింది. "నా పేరు క్లిక్‌బైట్‌ల కోసం వాడటం చాలా సులభమైంది. గతంలోనూ అబద్ధాలు రాసి, నా జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేశారు. నేను సైలెంట్ గా చూసి ఉన్నా. అబద్ధాలతో నా ఇమేజ్‌ని చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అది వర్క్ కాలేదు" అని నోరా అన్నారు.
"ఈసారి మాత్రం అదేం జరగదు. నా పేరు, ఫోటో, ఇమేజ్‌ను దేని లాగానైనా వాడకండి. నాకు సంబంధం లేని విషయాల్లో నా పేరు రాస్తే, ప్రచారం చేస్తే ఈసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది" అంటూ నోరా పదునైన హెచ్చరిక ఇచ్చింది. " దయచేసి నా పేరు పేరుమరోసారి ఉపయోగించకండి. " అంటూ తన పోస్ట్ ముగించింది.
ఇటీవల దావూద్ నెట్‌వర్క్‌కు చెందిన అక్రమ పార్టీలపై విచారణ జరుగుతుండగా, కొన్ని మీడియా వర్గాల్లో నోరా పేరు ప్రస్తావించబడింది. ఇదే విషయంపై ఆమె ఈసారి గట్టిగా స్పందించింది. గతంలో కూడా 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో పేరున్న సుకేశ్ చంద్రశేఖర్ వ్యవహారంలో నోరా పేరు వినిపించడంతో చర్చలకు దారి తీసింది. ప్రస్తుతం నోరా చేసిన ఈ స్టేట్మెంట్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











