ఆ టాప్ ప్రొడ్యూసర్ నాకు షుగర్ డాడీ.. అఫైర్‌పై నోరా ఫతేహి
చిత్ర పరిశ్రమలో నటీనటుల రిలేషన్స్, ఎఫైర్స్, పెళ్లిళ్లు, బ్రేకప్ లాంటివి కామన్. ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. హీరోలే కాదు.. దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ కూడా యవ్వారాలు నడిపినవారు ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ తరహా న్యూస్ రోజూ వినిపిస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని నిజమైతే.. కొన్ని పుకార్లుగా మాత్రమే వినిపిస్తుంటాయి. కొందరు నటీనటులు వీటిపై స్పందిస్తూ ఉండగా.. మరికొందరు మాత్రం వదిలేస్తారు. తాజాగా ఓ బడా నిర్మాతకు తనకు ఎఫైర్ ఉందంటూ వస్తోన్న వార్తలపై బాహుబలి ఫేమ్ నోరా ఫతేహి సీరియస్‌గా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే...
డ్యాన్సర్‌గా స్టార్‌డమ్
డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి స్టార్ స్టేటస్ అందుకున్న వారిలో నోరా ఫతేహి ఒకరు. రేర్ : టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రంతోనే మంచి మార్కులు వేయించుకున్నారు. ఆ వెంటనే బిగ్‌బాస్ హిందీ షోలో అవకాశం దక్కించుకుని బాలీవుడ్ మేకర్స్ కళ్లలో పడింది. స్వతహాగా మంచి డ్యాన్సర్ కావడంతో నోరా ఫతేహికి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశాలు వచ్చాయి. తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ ద్వారా తెలుగువారిని పలకరించారు నోరా ఫతేహి.

బాహుబలితో ఇంటర్నేషనల్ పాపులారిటీ
అనంతరం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి హిస్టారికల్ మూవీ బాహుబలి ఆమెకు ఇంటర్నేషనల్ రేంజ్‌లో పేరు తీసుకొచ్చింది. కేవలం స్పెషల్ సాంగ్స్ మాత్రమే చేసే నోరా ఫతేహి.. స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. 5 నిమిషాల పాట కోసం రూ.2 నుంచి 4 కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటున్నట్లుగా బాలీవుడ్ టాక్ . విషయం ఏదైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్టైల్. గతంలో పలువరు సినీ ప్రముఖులపై నోరా ఫతేహి హాట్ కామెంట్స్ చేసింది. తనకు బాయ్ ఫ్రెండ్స్ లేరని, కానీ కొందరు తనను కేవలం పాపులారిటీ కోసమే వాడుకుంటున్నారని బాంబు పేల్చింది. ప్రస్తుతం కన్నడ చిత్రం కేడీ: ది డెవిల్, తమిళంలో కాంచన 4లో నోరా ఫతేహి నటిస్తున్నారు.
ఆ కార్లు, బంగ్లాలు ఆమెకు ఎక్కడివి?
ఇదిలాఉండగా.. నోరా ఫతేహి పలువురితో డేటింగ్ చేసినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇటీవలి కాలంలో ప్రముఖ నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో నోరా ఫతేహి రిలేషన్‌లో ఉన్నారని బీటౌన్ మీడియా కోడై కూసింది. నోరా ఊహించని ఎదుగుదల, ఆమె పాపులారిటీ, లగ్జరీ లైఫ్‌స్టైల్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ వీరిద్దరి బంధంపై సోషల్ మీడియాలో దారుణమైన పోస్ట్‌లు పెడుతున్నారు. ఆమెకు భూషణ్ కుమార్ షుగర్ డాడీ అని కొందరు దారుణంగా రాసుకొచ్చారు. దీనిపై నోరా ఫతేహి సీరియస్‌గా స్పందించింది. తనపై వస్తున్న ఊహాగానాగాలు, రూమర్స్ తాలూకా స్క్రీన్ షాట్లను షేర్ చేసింది. ఓ వీడియోకు వావ్ అంటూ స్మైలింగ్ మెసేజ్ పెట్టింది.
నెటిజన్ల ఫైర్
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు నోరా ఫతేహి ఈ వివాదంపై ఎందుకు స్పందించింది? దీని వల్ల మరింత మంది దృష్టిని ఇది ఆకర్షిస్తుంది. ఆమె తనంతట తానే ఇబ్బందులను కొని తెచ్చుకుంటోంది అని మండిపడ్డారు. మరో యూజర్ మాత్రం ధృవీకరించని వాదనలను వ్యాప్తి చేయడాన్ని విమర్శిస్తూ.. కేవలం గాసిప్‌లపై ఆధారపడి కొన్ని విషయాలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం బాధ్యతారాహిత్యమని కామెంట్ పెట్టారు. ప్రజలు తాము విన్నది, చూసినది ఏదైనా నిజమని నమ్ముతారు. కేవలం కొన్ని వ్యూస్, లైక్స్ కోసం వ్యక్తుల ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారని నోరా ఫతేహికి మద్ధతుగా నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఇకపోతే.. భూషణ్ కుమార్‌కు.. 2005లో నటి, దర్శకురాలు దివ్య ఖోస్లాకు వివాహం జరిగింది ఈ దంపతులకు 2011లో ఓ కుమారుడు జన్మించారు. అయితే తనకు నోరా ఫతేహికి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వస్తున్న వార్తలపై భూషణ్ కుమార్ స్పందించలేదు.


Click it and Unblock the Notifications











