డ్రగ్స్ అలవాటు, స్వలింగ సంపర్కంపై తనుశ్రీ దత్తా దిమ్మదిరిగే కౌంటర్!

Recommended Video

Tanushree Reacts On Rakhi Sawant's Words

తనుశ్రీ దత్తా పదేళ్ల క్రితం తనను రేప్ చేసిందని, ఆమె ఒక లెస్బియన్ అని, అప్పట్లో మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండేవారమని, ఆ సమయంలో తనుశ్రీ నన్ను రేవ్ పార్టీలకు తీసుకెళ్లేది, అక్కడ డ్రగ్స్ సేవిస్తూ తనకు కూడా అలవాటు చేసిందంటూ రాఖీ సావంత్ ఆరోపించిన సంగతి తెసిందే.

రాఖీ సావంత్ ఆరోపణలపై తనుశ్రీ దత్తా స్పందించారు. 'తనపై కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి నేను భయపడను. నేను డ్రగ్ ఎడిక్ట్ కాదు, స్మోక్ చేసే అలవాటు కానీ, డ్రింక్ చేసే అలవాటు కానీ లేదు. నేను లెస్బియన్ అసలే కాదు' అని స్పష్టం చేశారు.

 జోకర్ వేషాలు వేయొద్దు

జోకర్ వేషాలు వేయొద్దు

మీటూ ఉద్యమం సీరియస్‌గా జరుగుతున్న సమయంలో ఇలాంటి జోకర్ వేషాలు వేయవద్దు. ఇలాంటి వర్కౌట్ కాకపోగా నిన్నే నవ్వుల పాలు చేస్తాయి. ఇకనైనా కుతంత్రాలు చాలించు.... అంటూ తనుశ్రీ దత్తా తనదైన రీతిలో రాఖీకి కౌంటర్ ఇచ్చింది.

ఇద్దరి మధ్య గొడవకు కారణం

ఇద్దరి మధ్య గొడవకు కారణం

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా పదేళ్ల క్రితం తాను ‘హార్న్ ఓకే ప్లీజ్' సెట్స్‌లో నానా పాటేకర్ వల్ల వేధింపులు ఎదుర్కొన్నట్లు #మీటూ ఉద్యమంలో భాగంగా బయట పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో తనుశ్రీ తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఐటం సాంగ్ చేయడానికి రాఖీ సావంత్‌ను తీసుకున్నారు.

ఆ తర్వాత రెచ్చిపోయింది

ఆ తర్వాత రెచ్చిపోయింది

ఈ నేపథ్యంలో నానా పాటేకర్ మీద తనుశ్రీ చేసిన ఆరోపణలను రాఖీ సావంత్ ఖండించారు. పబ్లిసిటీ కోసమే అలా చేస్తోందని ఆరోపించారు. రాఖీ తన ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ఉందంటూ తనుశ్రీ దత్తా రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేయడంతో.... రాఖీ మరింత రెచ్చిపోయింది. తనుశ్రీ మీద రేప్, లెస్పియన్ అంటూ ఆరోపణలు చేశారు.

బాలీవుడ్లో ఉధృతంగా మీటూ

బాలీవుడ్లో ఉధృతంగా మీటూ

తనుశ్రీ తర్వాత చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి మీటూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. దీంతో లైంగిక వేధింపులకు పాల్పడిన సాజిద్ ఖాన్, సుభాష్ ఘాయ్, అను మాలిక్, అలోక్ నాథ్ లాంటి ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X