Janhvi kapoor: దేవరకు జాన్వీ కపూర్ ఫస్ట్ ఛాయిస్ కాదా? ఆ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే?

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్ గా భారీ ప్రాజెక్ట్ దేవర అనే చెప్పొచ్చు. కాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు శివతో తమ కాంబినేషన్ లో రెండో సినిమాగా చేసిన ఈ చిత్రం భారీ అంచనాలు ఇప్పుడు సెట్ చేసుకుంది. ఇలా ఈ సినిమా అంతకంతకు మరిన్ని అంచనాలు ఏర్పర్చుకుంటూ కేవలం మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధం అయ్యింది.

కాగా ఈ భారీ ప్రాజెక్ట్ పైనే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ "దేవర" ఫలితాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఇది మొట్టమొదటి సినిమా పైగా సీనియర్ నటి శ్రీదేవి కూతురు కూడా కావడంతో జాన్వీ కపూర్ కి దేవర ఫలితం చాలా కీలకంగా మారింది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ లోకి జాన్వీ కపూర్ అసలు మొదటి ఛాయిస్ కానే కాదట.

not janhvi kapoor this heroine si first choice for devara heroine

దేవర సినిమా అనుకున్న సమయంలో కొరటాల శివకి గాని అలాగే ఎన్టీఆర్ కి గాని హీరోయిన్ గా ఎవరిని పెడదాము అనే ఆలోచన ఉంది కానీ జాన్వీనే పెడదాం అని అనుకోలేదట. కానీ అప్పటికే చాలాసార్లు జాన్వీ మాత్రం ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చాలా సార్లు చెప్పింది అని మరి మాకు అప్పటికి జాన్వీని హీరోయిన్ గా పెట్టాలి అని అనిపించని సమయంలో జాన్వీ కోరుకుందో ఏమో కానీ తర్వాత దేవర లోకి వచ్చింది అని తారక్ రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడి చేసాడు.

కాగా ఈ చిత్రం మొదలు పెట్టిన సమయంలో అంటే 2023 ఏప్రిల్ సమయంలో అయితే జాన్వీ కాదు కానీ మరో హీరోయిన్ పేరు బాగా వినోపించిందివినిపించింది. ఆమె ఎవరో కాదు ర్నేషనల్ క్రష్ రష్మికా మందన్నానే. కాగా రష్మిక పేరు ఎన్టీఆర్ సరసన అంటూ బజ్ వచ్చినపుడు మాత్రం ఫ్యాన్స్ కి అది ఏమాత్రం నచ్చలేదు. మరి అది ఈ సినిమాకే అన్నట్టుగా కూడా టాక్ నడిచింది.

not janhvi kapoor this heroine si first choice for devara heroine

కానీ ఫైనల్ గా జాన్వీ కపూర్ అయితే ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయ్యింది. సో ఇలా సీనియర్ శ్రీదేవి వారసురాలిగా తెలుగు సినిమా లోకి జూనియర్ శ్రీదేవి రాబోతుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రంతో జాన్వీ కపూర్ హిట్ కొడుతుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. అలాగే ఈ సినిమా కోసం జాన్వీ చాలా కష్టపడింది. జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా షూట్ లో పాల్గొంది.

మరి ఇంతలా డెడికేషన్ చూపించిన ఈ సినిమా ఏమవుతుందో ఈ సెప్టెంబర్ 27 వరకు ఆగితే తెలిసిపోతుంది. కాగా ఈ భారీ చిత్రానికి సంగీత సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. అలాగే ఈ 27న పాన్ ఇండియా భాషల్లో దేవర ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

More from Filmibeat

Read more about: janhvi kapoor jr ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X