RRR: ఎన్టీఆర్ అభిమానుల ఎఫెక్టుతో మూడు రెట్లు పెరిగిన గ్రాఫ్!
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ 'RRR'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన లండన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 'RRR'లో డైసీ పేరు ప్రకటించగానే ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
అప్పటి వరకు డైసీ ఎడ్గర్ జోన్స్ బ్రిటన్‌కు చెందిన ఒక సాధారణ టీవీ నటి. అక్కడ కూడా ఆమెకు పెద్దగా ఫ్యాన్స్ లేరు. కానీ RRR తర్వాత ఆమెకు ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచ వ్యప్తంగా ఉన్న ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు ఫ్యాన్స్ ఆమె గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

మూడు రెట్లు పెరిగిన గ్రాఫ్
RRR ప్రాజెక్ట్ ప్రకటించే సమయానికి డైసీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫాలోవర్స్ కేవలం 5 వేలు మాత్రమే. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటన తర్వాత ఈ గ్రాఫ్ మూడు రెట్లు పెరిగి 20 వేలకు చేరుకుంది. ఇందులో ఎక్కువగా ఎన్టీఆర్ అభిమానులే ఉండటం గమనార్హం.

లండన్ బ్యూటీ వెంట పడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
ఎన్టీఆర్ అభిమానులు... ఆమె కొత్త పోస్టు పెట్టగానే వెంటనే లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వెల్ కం టు టాలీవుడ్, జై ఎన్టీఆర్, యంగ్ టైగర్‌తో మీరు స్క్రీన్ షేర్ చేసుకోవడం మీ అదృష్టం, మీరు త్వరగా రావాలి లేకుంటే షూటింగ్ లేటవుతుంది....అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

RRR ప్రాజెక్ట్ అప్డేట్స్ ఇవ్వండి
మరికొందరైతే.. RRR ప్రాజెక్ట్ అప్డేట్స్ ఇవ్వండి అంటూ డైసీకి సందేశాలు పంపుతున్నారు. అయితే ఇండియన్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ కామెంట్లకు డైసీ నుంచి ఎలాంటి రిప్లై రావడం లేదు. ఆవిడ ఇంకా ఇండియా రాలేదని, త్వరలోనే RRR షూటింగులో పాల్గొంటారని చిత్ర బృందం చెబుతోంది.

షూటింగ్ రద్దు
RRR న్యూ షెడ్యూల్ ఇటీవలే ఉత్తరభారత దేశంలో ప్రారంభం అయింది. అయితే జిమ్ చేస్తుండగా రామ్ చరణ్ గాయపడటంతో షూటింగ్ 3 వారాలు వాయిదా పడింది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. 2020 జులై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











