పైన ఏమీ వేసుకోకుండా జాన్వీ కపూర్ షో: ఊరించే ఫొటోలు వదిలిందేంటి!
ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ మంది స్టార్లు తమ వారసులను సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. అలా వచ్చిన వారిలో మాత్రం కొందరే సక్సెస్ అయ్యారు. అందులో అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఒకరు. అందంతో పాటు నటనలోనూ రాణిస్తూ.. చాలా తక్కువ సమయంలోనే ఈ అమ్మడు విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో వరుసగా సినిమాలు చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ జాన్వీ కపూర్ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

చిన్న వయసులోనే సెన్సేషన్
జాన్వీ కపూర్ చిన్న వయసులోనే శ్రీదేవి కూతురిగా ప్రపంచానికి పరిచయమైంది. ఆ తర్వాత లవ్ ట్రాకులు, హాట్ డ్రెస్‌లు ఇలా ఎన్నో రకాలుగా సంచలనం అయిపోయింది. ఈ క్రమంలోనే జాన్వీ 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. దీనికితోడు ఇది వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరి రికార్డులు కొట్టింది.

వరుస మూవీలు.. స్టార్ స్టేటస్
'ధడక్' మూవీతో జాన్వీ కపూర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దీన్ని ఎక్కడా చెడగొట్టుకోకుండా ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్‌లో నటించి మెప్పించింది. అయితే మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం నిరాశనే మిగిల్చింది.

ఆ రెండూ సక్సెస్ ఇవ్వలేదు
ఫలితాలతో సంబంధం లేకుండా బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేస్తూనే ఉంది. గత ఏడాది ఈ అమ్మడు 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీతో వచ్చింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో స్పందన దక్కలేదు. అలాగే, బోనీ కపూర్ నిర్మించిన 'మిలీ' అనే సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇది కూడా జాన్వీకి సక్సెస్‌ను మాత్రం అందించలేదు.

ఆ చిత్రాలు... ఎన్టీఆర్ మూవీ
సినిమాలు సక్సెస్ అవకున్నా జాన్వీ కపూర్ ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడీ అమ్మడు హిందీలో 'బవాల్', 'మిస్టర్ అండ్ మిస్సెస్ మహి' అనే చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ద్వారా తెలుగులోకి కూడా జాన్వీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఆమె పోస్టర్‌ను వదిలారు.

అందులోనూ యమ బిజీగానే
జాన్వీ కపూర్ సినిమా నటిగా ఎంత పాపులర్ అయిందో.. సోషల్ మీడియాలోనూ అంతే రీతిలో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. అందుకే ఈ అమ్మడు ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్ షోలో గీత దాటేస్తూనే
చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలనే ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ వార్తల్లోనే ఉంటూ హాట్ టాపిక్ అయిపోతోంది.

జాకెట్ లేకుండానే జాన్వీ షో
తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ లేకుండానే చీర కట్టుకుని రెచ్చిపోయింది. ఫలితంగా ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ అందాలు కుర్రకారుకు కొసరి కొసరి వడ్డిస్తున్నట్లుగా ఉన్నాయి. దీంతో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











