పెళ్లిపీటలెక్కనున్న రవితేజ హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి, నటి నుపుర్ సనన్ (Nupur Sanon) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్ముడు మొదట టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమాలో గ్లామర్‌తో పాటు నటనకు మంచి మార్కులు దక్కించుకున్నప్పటికీ, సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో తెలుగులో ఆమెకు పెద్ద అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' చిత్రంలోనూ ఆమెకు అవకాశం వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
అనంతరం బాలీవుడ్ వైపు దృష్టి పెట్టిన నుపుర్, సినిమాలకంటే ముందుగా మ్యూజిక్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బి ప్రాక్ పాడిన 'ఫిలాల్' లాంటి సూపర్ హిట్ మ్యూజిక్ వీడియోల్లో నటించి యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే.. నటి నుపుర్ సనన్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతుంది. తాను త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

తన ప్రియుడు, ప్రముఖ బాలీవుడ్ సింగర్ స్టెబిన్ బెన్ తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ జంట వార్తల్లో నిలిచింది. స్టెబిన్ నుపుర్‌కు పెళ్లి ప్రపోజల్ చేస్తూ మోకాళ్లపై కూర్చున్న ఫొటోలు, ఆ క్షణాన్ని నుపుర్ ఆనందంగా అంగీకరించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సమాచారం ప్రకారం.. 2023 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట జనవరి 3న తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇక తాజా టాక్ ప్రకారం.. జనవరి 11న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. కోట తరహా వెన్యూ, సంప్రదాయ రాజస్థానీ స్టైల్‌లో ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య నిర్వహించనున్నట్లు సమాచారం. వివాహం అనంతరం ముంబైలో భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వరుడు ఎవరంటే?
నుపుర్‌కు కాబోయే భర్త స్టెబిన్ బెన్ బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరు. రొమాంటిక్ సాంగ్స్‌కు పెట్టింది పేరైన స్టెబిన్, తక్కువ కాలంలోనే పెద్ద ఫ్యాన్‌బేస్ సంపాదించాడు. ఆయన పాటలు యూత్‌తో పాటు మ్యూజిక్ లవర్స్‌లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహమేనని ఇప్పటికే స్పష్టత వచ్చింది. మొత్తంగా చూస్తే... నుపుర్ సనన్ - స్టెబిన్ బెన్ జంట ఎంగేజ్‌మెంట్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఎలా జరగబోతోంది? సెలబ్రిటీ గెస్ట్‌లుగా ఎవరు హాజరవుతారు? అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











