హీరోయిన్ నుస్రత్ హానీమూన్ ఫోటో వైరల్.. పెళ్లి తర్వాత భర్తతో యువ ఎంపీ విహారం
బెంగాల్ చిత్ర సీమలో యువ తారగా రాణించిన నుస్రత్ జహాన్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యురాలిగా తృణమూల్ కాంగ్రెస్ తరుఫున గెలిచింది. గత కొద్దికాలంగా పారిశ్రామిక వేత్త నిఖిల్ జైన్‌తో అఫైర్ కొనసాగిస్తున్న నుస్రత్ ఇటీవల వివాహం చేసుకొన్నది. ముస్లిం మతానికి చెందిన నుస్రత్ హిందువును పెళ్లి చేసుకోవడంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా వాటిన పట్టించుకోకుండా నుదుట సింధూరంతో అందరికీ షాకిచ్చింది.

ప్రస్తుతం బెంగాళీ ముద్దుగుమ్మ, యువ ఎంపీ నుస్రత్ జహాన్ హానీమూన్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నది. పెళ్లి అనంతరం రెండు నెలల తర్వాత భర్త, పారిశ్రామిక వేత్త నిఖిల్ జైన్‌తో కలిసి ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తున్నది. హానీమూన్ పర్యటనలో సముద్ర తీరంలో తీసిన ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్ ద్వారా పంచుకొన్నారు. పక్కాగా వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌తో హంగామా చేసింది. నల్లటి చారులతో కూడిన తెల్లటి టీషర్ట్‌పై వైట్ ప్యాంట్ వేసుకొన్నది. సన్ గ్లాసెస్ ధరించి ఫొటోకు ఫోజిచ్చింది. నుదుట సింధూరం, చేతికి గాజులతో సాంప్రదాయ హిందూ వనితగా కనిపించింది.

భర్త నిఖిల్ జైన్ తీసిన ఫొటోను ఇన్స్‌టాలో పోస్టు చేసి అనంతరం.. ఈ ఫొటోలో నీవు కూడా ఉండి ఉంటే బాగుండేది. నీవు కోరుకొనే స్వర్గం అద్భుతమైన క్షణాల్లో, సంబంధాల్లో, సమయంతో పని లేకుండా ఉంటుంది అని ఓ కాప్షన్ పెట్టింది.


Click it and Unblock the Notifications











