twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పార్లమెంట్‌కు డుమ్మా కొట్టి... ఫొటోషూట్‌లా.. ఎంపీ‌గా ఎన్నికైన సినీనటిపై ఆగ్రహం

    |

    ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి సినీ నటి నుస్రత్ జహాన్ ఎంపికైన సంగతి తెలిసిందే. యంగ్ అండ్ బ్యూటిఫుల్ ఎంపి బసిర్హత్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరుఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. దాదాపు 3 లక్షల ఓట్లతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే పార్లమెంట్‌లోకి అడుగుపెట్టకుండానే నుస్రత్ పెళ్లి చేసుకోవడం ఓ వివాదంగా మారింది. ఆ వివాదం ఏమిటంటే..

     నుస్రత్ జహాన్ కొంతకాలంగా డేటింగ్

    నుస్రత్ జహాన్ కొంతకాలంగా డేటింగ్

    యాక్టర్, పొలిటిషన్ నుస్రత్ జహాన్ గత కొద్దికాలంగా టర్కీకి చెందిన పారిశ్రామికవేత్త నిఖిల్ జైన్‌తో అఫైర్‌లో ఉంది. ఎన్నికలకు ముందే వీరిద్దరి డేటింగ్ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా మారింది. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారం జూన్ 19వ తేదీని పెళ్లికి ముహుర్తంగా నిర్ణయించారు.

     ప్రియుడితో పెళ్లి రోజునే ప్రమాణ స్వీకారం

    ప్రియుడితో పెళ్లి రోజునే ప్రమాణ స్వీకారం

    పెద్దల అంగీకారంతో టర్కీలోని బోడ్రం అనే అందమైన ప్రదేశంలో పెళ్లి చేసుకొన్నారు. నిఖిల్‌తో జరిగిన పెళ్లికి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఇంత వరకు అంతా హ్యాపీగానే జరిగిపోయింది. కానీ పెళ్లి రోజే పార్లమెంట్ ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది.

     పార్లమెంట్‌కు డుమ్మా కొట్టి

    పార్లమెంట్‌కు డుమ్మా కొట్టి

    నిఖిల్ జైన్‌తో వివాహం కారణంగా నుస్రత్ జహాన్ పార్లమెంట్‌లో జరిగిన నూతన సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. ఈ విషయాన్ని నెటిజన్లు గమనించి సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. ఆమెపై ట్రోల్ చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం నుస్రత్ పెళ్లి వ్యవహారంపై నెటిజన్లు సీరియస్‌గా ఉన్నారు. అంతేకాకుండా మతాంతర వివాహం చేసుకోవడంపై ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయి.

     నుస్రత్‌ జహాన్‌పై నెటిజన్ల ఫైర్

    నుస్రత్‌ జహాన్‌పై నెటిజన్ల ఫైర్

    పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారానికి హాజరుకాని నుస్రత్‌పై ట్వీట్టర్‌లో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్నది. తొలి పార్లమెంట్ సెషన్స్‌కు హాజరుకాకుండా డుమ్మా కొట్టిన ఎంపీని చూస్తే, ఎన్నుకొన్న ప్రజలను చూస్తే జాలి వేస్తున్నది. ఇలా ప్రమాణా స్వీకారం చేయని ఎంపీ.. ప్రజల బాగోగులు పట్టించుకొంటుందా అని ప్రశ్నిస్తున్నారు.

    ఇలాంటి ఎంపీని చూడలేదని

    ఇలాంటి ఎంపీని చూడలేదని

    నుస్రత్ లాంటి బాధ్యతారహితమైన ఎంపీని, ప్రజా ప్రతినిధిని ఇప్పటి వరకు చూడలేదు. తాము చేసిన తప్పుకు బెంగాల్ ప్రజలు బాధపడటం ఖాయం. ఫోటో షూట్‌లకు సమయం ఉంది గానీ, పార్లమెంట్‌కు హాజరుకావడానికి సమయం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందే పెళ్లి తేది ఖారారైందని, దాంతో ఆమెకు దిక్కు తోచని పరిస్థితి ఎదురైందని కొందరు పేర్కొంటున్నారు.

    English summary
    Nusrat Jahan got married on the day when she was supposed to be in the parliament and taken an oath, and Twitterati did not miss noticing this fact. What an irresponsible human being and public personality. People of West Bengal will always regret this mistake. She has time to pose for photoshoots, but no time to attend the parliament," added another user on Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X