For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నుస్రత్ జహాన్ కొడుకు పేరుతో కొత్త టెన్షన్.. అతనే తండ్రా? అందుకే ఆ లింక్?

  |

  బెంగాలీ నటి మరియు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఇటీవల ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమె కొడుకు పేరు వెల్లడించారు. ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత గురువారం, మదర్ థెరిస్సా జయంతి రోజున పార్క్ స్ట్రీట్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నుస్రత్ జహాన్ ఒక కుమారుడికి జన్మనిచ్చారు. ఆసుపత్రి వర్గాల ప్రకారం, నుస్రత్ జహాన్ ఈరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావచ్చని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెలితే

  బిడ్డకు తండ్రి అతనేనా

  బిడ్డకు తండ్రి అతనేనా

  విశేషమేమిటంటే, భర్త నిఖిల్ జైన్ నుంచి విడిపోయిన తర్వాత నుస్రత్ జహాన్ ఎప్పుడూ వార్తలలో నిలిస్తూనే ఉంది. టర్కీలో తమ వివాహం భారతదేశంలో చెల్లదని తన భర్త నుంచి విడిపోయిన తర్వాత నుస్రత్ చెప్పింది. ఆమె నిఖిల్ జైన్‌తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధంలో లేదని చెబుతోంది. అంతే కాక నుస్రత్ మొదటి భర్త నిఖిల్ జైన్ కూడా తాను బిడ్డకు తండ్రి కాదని చెప్పారు. దీంతో అసలు ఇప్పుడు బిడ్డ పుట్టిన తరువాత, తండ్రి పేరు గురించి ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. పిల్లల తండ్రి పేరుకు సంబంధించి నుస్రత్ జహాన్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారు. అయితే వీటి గురించి పెద్దగా పట్టించుకోని నుస్రత్ తన బిడ్డకు 'ఇషాన్' అని పేరు పెట్టింది.

   యశ్ దాస్‌గుప్తాతో ప్రేమలో

  యశ్ దాస్‌గుప్తాతో ప్రేమలో

  ఆమె భర్తతో విడిపోవడానికి కారణం బెంగాలీ హీరో యశ్ దాస్‌గుప్తాతో ప్రేమలో పడటమే అనే వార్త మీడియాలో బలంగా వినిపించింది. అంతే కాక కోల్‌కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిడ్డ పుట్టిన తర్వాతే సోషల్ మీడియా ద్వారా నుస్రత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. యశ్ దాస్‌గుప్త కూడా బిడ్డ పుట్టిన తర్వాత తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ని పంచుకున్నారు. ఇందులో అతను నుస్రత్ మరియు బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారని చెప్పారు. దీంతో బాబు పేరు సినీ నటుడు యశ్ దాస్‌గుప్తా పేరుతో సరిపోతుందని ఇప్పుడు నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. బిడ్డకు తండ్రి అతనేనా అని ప్రశ్నిస్తున్నారు.

  'ఇషాన్' టెన్షన్

  'ఇషాన్' టెన్షన్

  నుస్రత్ తన కుమారుడికి 'ఇషాన్' అని పేరు పెట్టారు మరియు ఆంగ్లంలో దీనిని 'యిషాన్' అని పిలుస్తారు. ఈ పేరుతో, ఇంటర్నెట్‌లో అభిమానులు ట్రోల్స్ చేస్తూ ఈ బిడ్డ నటుడు యశ్ దాస్‌గుప్తా బిడ్డే అని ఊహిస్తున్నారు. వాస్తవానికి, ఆ చిన్నారి పేరు యష్‌తో సరిపోలడమె దీనికి కారణం. అంతే కాక ఇదొక్కటే కాదు, యష్ కూడా ఈ ప్రసవం సమయంలో నుస్రత్‌తో కలిసి ఆసుపత్రిలో ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. బిడ్డ జన్మించిన తర్వాత, నుస్రత్ మరియు నవజాత శిశువు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని అతనే ముందు సోషల్ మీడియాలో వెల్లడించారు.

  వివాహాన్ని రద్దు చేసి

  వివాహాన్ని రద్దు చేసి

  ఇంతకు ముందు కూడా, నుస్రత్ తరచుగా గర్భధారణ సమయంలో యశ్ దాస్‌గుప్తతో కలిసి కనిపించేవారు. వారు తరచుగా కలిసి డిన్నర్‌కు వెళ్లేవారు. సోషల్ మీడియాలో కూడా, వారి సాన్నిహిత్యం గురించి కథనాలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. నుస్రత్ టర్కీ వివాహ నియమాల ప్రకారం 2019 సంవత్సరంలో వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకున్నాడు, కాబట్టి ఈ వివాహం భారతదేశంలో చట్టపరమైన రీతిలో రికార్డు కాలేదు. ఇక తమ వివాహాన్ని రద్దు చేసినందుకు ఈ ఏడాది మార్చి 8 న నిఖిల్ జైన్ కూడా నుస్రత్‌పై సివిల్ దావా వేశారు.

  Prabhas పై పెరుగుతున్న అక్కసు.. అప్పుడు రజినీ ఇప్పుడు డార్లింగ్ | Pan India || Filmibeat Telugu
   నిఖిల్ జైన్ శుభాకాంక్షలు

  నిఖిల్ జైన్ శుభాకాంక్షలు

  మరో విషయం ఏమిటంటే నుస్రత్ జహాన్ నుండి విడిపోయిన నిఖిల్ జైన్ కూడా నటి మరియు చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు. నిఖిల్ మాట్లాడుతూ, 'మా మధ్య విభేదాలు ఉండవచ్చు, అప్పుడే పుట్టిన శిశువు మరియు తల్లికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బేబీ ఉజ్వల భవిష్యత్తు కోసం నేను ప్రార్థిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.

  English summary
  Actor and Trinamool Congress Mp Nusrat Jahan given birth to Baby boy in Kolkata hospital. Reports suggested that She Named Her Son as Yishaan
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X