బికినీలో నువ్వు నేను అనిత ఓవర్ షో: అప్పట్లో పద్దతిగా.. ఇప్పుడేమో ఘాటుగా!

తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలకే విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో ఒకప్పుడు తనదైన అందం, అభినయంతో అలరించిన అనిత ఒకరు. 'నువ్వు నేను' చిత్రంతో వచ్చిన ఈ భామ.. చాలా ఏళ్ల పాటు ఎన్నో సినిమాలు చేసింది. ఈ మధ్య కాలంలో హిందీ సీరియళ్లను మాత్రమే చేస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌ను అనిత అలరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

ఉదయ్ కిరణ్‌తో మొదలైంది:మోడల్‌గా ఫుల్ ఫేమస్ అయిన అనిత.. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చిత్రం 'నువ్వు నేను' సినిమాతోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంటరైంది. ఇది సూపర్ హిట్ అవడంతో వరుస ఆఫర్లు అందుకుంది. దీని తర్వాత 'శ్రీరామ్', 'తొట్టిగ్యాంగ్', 'నిన్నే ఇష్టపడ్డాను', 'ఆడంతే అదోటైపు', 'ఆహా నాపెళ్లంట' సహా ఎన్నో చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది.

Nuvvu Nenu Actress Anita Latest Good Looking Photos Viral

ఎన్నో చేసినా సక్సెస్ రాలేగా:తెలుగులో చేసిన ఒకే ఒక్క చిత్రంతో ఫుల్ పాపులర్ అయిన అనిత.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాలను మాత్రం పెద్దగా అందించలేదు. దీంతో టాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చేసింది. ఆ తర్వాత తమిళం, హిందీ, కన్నడం, పంజాబీ భాషల్లో సైతం నటించింది. కానీ, వాటిలో కూడా అనిత హీరోయిన్‌గా సక్సెస్ మాత్రం కాలేదనే చెప్పుకోవాలి.

బుల్లితెరపైకి.. నాగిన్‌తో క్రేజ్:హీరోయిన్‌గా కెరీర్‌ ప్రశ్నార్థకం అయిపోవడంతో అనిత వెండితెరకు దూరంగా వచ్చేసింది. అదే సమయంలో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 'హరే కంచ్‌కి చుడియాన్' అనే సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె.. ఆ తర్వాత ఎన్నో సీరియళ్లలో నటించి మెప్పించింది. వాటిలో తెలుగులోనూ ప్రసారమైన 'నాగినీ' సిరీస్‌‌తో ఆమె మళ్లీ దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది.

Nuvvu Nenu Actress Anita Latest Good Looking Photos Viral

ప్రేమ పెళ్లి.. ఇప్పుడు కూడా:సినిమాల కంటే సీరియళ్లతోనే సక్సెస్ అయిన అనిత.. ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తతో లవ్‌లో పడింది. కొన్నేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. 2013లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అంటే 2021లో ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. అయినప్పటికీ అనిత మాత్రం కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ.. వరుసగా సీరియళ్లు చేస్తూ ముందుకు సాగుతోంది.

Nuvvu Nenu Actress Anita Latest Good Looking Photos Viral

సోషల్ మీడియాలో బిజీగా:దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు, సీరియళ్లు చేస్తూ సత్తా చాటుతోన్న సీనియర్ హీరోయిన్ అనిత.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ నటీమణి తరచూ తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయంలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఇప్పటికీ క్రేజ్‌ను కంటిన్యూ చేసుకుంటోంది.

Nuvvu Nenu Actress Anita Latest Good Looking Photos Viral

హాట్ ట్రీట్‌తో రెచ్చిపోతూ:సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అనిత పెద్దగా గ్లామర్ షో చేయడానికి ఇష్టపడలేదు. కానీ, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోతూనే ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హాట్ హాట్ ఫొటో షూట్లతో రెచ్చిపోతోంది. అంతేకాదు, బోల్డు వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా భర్తతో ఘాటు రొమాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వదులుతోంది.

Nuvvu Nenu Actress Anita Latest Good Looking Photos Viral

బికినీలో అనిత గ్లామర్ షో:సోషల్ మీడియాలో గీత దాటి మరీ రెచ్చిపోతోన్న హీరోయిన్ అనిత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బికినీలో కైపెక్కించే ఫోజులు ఇచ్చి మరీ అందాలను ఆరబోసింది. ఫలితంగా 42 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లను తెగ కవ్విస్తోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చి.. ఇవన్నీ బాగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X