నువ్వు నేను హీరోయిన్ అనిత అందాల ఆరబోత: ఈ ఏజ్‌లో కూడా టెంప్ట్ చేస్తుందిగా!
టాలీవుడ్‌గా గత పదేళ్ల కాలంలో కొంత మంది హీరోయిన్లు ఓ రేంజ్‌లో హవాను చూపించారు. తద్వారా చాలా ఏళ్ల పాటు వరుసగా సినిమాలు చేసి సందడి చేశారు. అందులో ప్రముఖ హీరోయిన్ అనిత ఒకరు. 'నువ్వు నేను' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంటరైన ఈ అమ్మడు.. చాలా ఏళ్ల పాటు ఎన్నో సినిమాలు చేసింది. ఈ మధ్య కాలంలో ఉత్తరాదిలో సీరియళ్లకే పరిమితం అయింది. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌ను అలరించేందుకు సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీరే చూడండి!
నువ్వు నేను అంటూ వచ్చింది:తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చిత్రం 'నువ్వు నేను'. ఈ సినిమాతోనే అనిత తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇది సూపర్ హిట్ అవడంతో వరుస ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే 'శ్రీరామ్', 'తొట్టిగ్యాంగ్', 'నిన్నే ఇష్టపడ్డాను', 'ఆడంతే అదోటైపు', 'ఆహా నాపెళ్లంట' సహా ఎన్నో చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో హవాను చూపింది.

ఆఫర్లతో అదృష్టం కలిసిరాలే:తెలుగులో అనిత నటించిన చిత్రాల్లో 'నువ్వు నేను' మినహా మరేదీ పెద్దగా విజయం సాధించలేదు. అయినప్పటికీ ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలోనే ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, అదృష్టం కలిసి రాకపోవడంతో నిరాశకు లోనయింది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళం, హిందీ, కన్నడం, పంజాబీలలో కూడా నటించినా పెద్దగా సక్సెస్ అందుకోలేదు.
అందులోకి ఎంట్రీ ఇచ్చింది:ఎన్ని సినిమాల్లో నటించినా అనితకు సరైన హిట్లు రాలేదు. దీంతో ఆమె సినిమాల్లో నటించడం మానేసింది. అదే సమయంలో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 'హరే కంచ్‌కి చుడియాన్' అనే సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె.. ఆ తర్వాత ఎన్నో సీరియళ్లలో నటించి మెప్పించింది. వాటిలో తెలుగులోనూ ప్రసారమైన 'నాగినీ' సిరీస్ ఆమెకు పేరు తెచ్చి పెట్టింది.

అతడితో పెళ్లి... కంటిన్యూగా:వరుసగా టీవీ సీరియళ్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సమయంలోనే అనిత.. రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. 2013లో అగ్నిసాక్షిగా ఒక్కటైంది. ఆ తర్వాత అంటే 2021లో ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. అయినప్పటికీ అనిత మాత్రం కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ.. వరుసగా సీరియళ్లు చేస్తూనే ముందుకెళ్తోంది.

అందులో ఎప్పుడూ యాక్టివ్:సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు చేస్తూ సత్తా చాటుతోన్న సీనియర్ హీరోయిన్ అనిత.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ నటీమణి తరచూ తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయంలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

ఇప్పుడూ కంటిన్యూ చేస్తోంది:హీరోయిన్ అనిత సినిమాలు, సీరియళ్ల కోసం గ్లామర్‌గా కనిపించడానికి వెనుకాడలేదు. పర్సనల్ లైఫ్‌లోనూ ఆమె అదే పంథాను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే హాట్ హాట్ ఫొటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది. అంతేకాదు, హీటెక్కించే వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా భర్తతో ఘాటు రొమాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వదులుతూనే ఉంది.

గ్లామర్ ఫొటోలతో షేక్ చేస్తూ:సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ అనిత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో పైటను పక్కకు జరిపి మరీ అందాలను ఆరబోసింది. ఫలితంగా 42 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చి.. ఇవి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











