నువ్వు నేను హీరోయిన్ సెన్సేషనల్ షో.. సినిమాల్లో ఎప్పుడూ కనిపించనంత ఘాటుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రేక్షకులను ఫిదా చేసి వరుసగా అవకాశాలను దక్కించుకున్నారు. అలాంటి వారిలో అనిత ఒకరు. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన 'నువ్వు నేను' మూవీతో వచ్చిన ఈ భామ.. అక్కడి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్లింది. ఫలితంగా చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించింది. ఇక, పెళ్లి తర్వాత ఇక్కడ కనిపించకున్నా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనిత కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను వదిలింది. అవి మీకోసమే!
అలా ఎంట్రీ.. పాపులారిటీ
అనిత మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత 'నువ్వు నేను' సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇది సెన్సేషనల్ హిట్ అవడంతో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. దీని తర్వాత 'శ్రీరామ్', 'తొట్టిగ్యాంగ్', 'నిన్నే ఇష్టపడ్డాను', 'ఆడంతే అదోటైపు', 'ఆహా నాపెళ్లంట' సహా ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్‌గా మారిపోయింది.

ఎన్నో సినిమాలు చేసినా
తెలుగు చిత్ర పరిశ్రమలో అనిత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటింది. కానీ, వాటిలో ఆమెకు విజయాన్ని అందించినవి మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. కానీ, తమిళం, హిందీ, కన్నడం, పంజాబీ భాషల్లో సైతం నటించింది. కానీ, వాటిలో కూడా అనిత హీరోయిన్‌గా సక్సెస్‌ఫుల్ కాలేదన్న విషయం తెలిసిందే.
నాగిన్ సీరియల్‌తో క్రేజ్
సినిమా హీరోయిన్‌గా అంతగా విజయవంతం కాలేకపోయిన అనిత.. బుల్లితెరపైకి 'హరే కంచ్‌కి చుడియాన్' అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది. ఇందులో సక్సెస్‌ను సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత ఎన్నో సీరియళ్లలో నటించి అలరించింది. ముఖ్యంగా 'నాగినీ' సిరీస్‌తో ఆమె దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసేసుకుంది. దీంతో మరింత హైలైట్ అయింది.

ప్రేమ పెళ్లి.. వాటిలోనే
సీరియల్ నటిగా ఫుల్ బిజీగా సాగిపోతోన్న సమయంలోనే అనిత.. రోహిత్ రెడ్డి అనే బిజినెస్‌మ్యాన్‌తో లవ్‌లో పడింది. కొన్నేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. 2013లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అంటే 2021లో ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. అయినప్పటికీ అనిత మాత్రం కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది. ఇలా ఇప్పుడు పలు సీరియళ్లలో నటిస్తోంది.
సోషల్ మీడియాలోనూ
దాదాపు పదిహేనేళ్లకు పైగానే సినిమాలు, సీరియళ్లు చేస్తూ సత్తా చాటుతోన్న క్యూట్ హీరోయిన్ అనిత.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ భామ.. తరచూ తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయంలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన అభిమానులను ఖుషీ చేస్తూ ముందుకు సాగుతోంది.

గ్లామర్ షోకు అడ్డే లేదు
సినిమాల్లో నటిస్తోన్న సమయంలో అనిత గ్లామర్ షో చేయడానికి ఇష్టపడలేదు. కానీ, బుల్లితెరపైకి వచ్చిన తర్వాత మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హాట్ హాట్ ఫొటోషూట్లతో సెన్సేషన్ అయిపోతోంది. అంతేకాదు, తరచూ బోల్డు వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా భర్తతో రొమాన్స్ చేసిన ఫొటోలనూ వదులుతూ అనిత సెన్సేషన్‌గా మారుతోంది.
అనిత ఫొటోలు వైరల్
కొంత కాలంగా సోషల్ మీడియాలో బౌండరీలు క్రాస్ చేస్తోన్న హీరోయిన్ అనిత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో బ్లేజర్ వేసుకుని ముందుకు వంగి మరీ క్లీవేజ్ షో చేస్తూ ఫోజులు ఇచ్చింది. వీటిలో ఆమె అందాలు యమా రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. తద్వారా ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











