For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పండంటి బిడ్డకు జన్మినిచ్చిన 'నువ్వు నేను' హీరోయిన్.. గుడ్ న్యూస్ చెప్పిన భర్త

  |

  20 ఏళ్ల క్రితం వచ్చిన నువ్వు నేను సినిమా అంటే ఆడియెన్స్ ఎప్పటికి మరచిపోలేరు. ఆ సినిమా పేరు వింటే ఉదయ్ కిరణ్ తో పాటు హీరోయిన్ అనితా హస్సానందని గుర్తుకు వస్తారు.పెద్దగా స్టార్ హీరోయిన్స్ గా ఎదగకపోయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ని జనాలు అంత ఈజీగా మర్చిపోలేరు. పెద్ద బడ్జెట్ సినిమాలు చేయని వాళ్ళు కూడా కేవలం ఒకట్రెండు సినిమాలతో జీవితానికి సరిపడా క్రేజ్ అందుకున్నారు. అలాంటి హీరోయిన్స్ లలో అనితా హస్సానందని ఒకరు. నువ్వు నేను సినిమాతో ఏ స్థాయిలో గుర్తింపు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమె మంగళవారం పండండి బిడ్డకు జన్మనిచ్చారు.

  నువ్వు నేను సినిమాతో బాక్సాఫీస్ హిట్

  నువ్వు నేను సినిమాతో బాక్సాఫీస్ హిట్


  అనిత హస్సానందని ఎక్కువగా క్రేజ్ అందుకుంది తన మొదటి సినిమా నువ్వు నేను తోనే.. 2001లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో ఆమె ఉదయ్ కిరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాలు కూడా చేసిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లలో కూడా నటించింది.

  ప్రెగ్నెన్సీ మొదటి నుంచి కూడా..

  ప్రెగ్నెన్సీ మొదటి నుంచి కూడా..

  అయితే మొదట సినిమాతో సక్సెస్ అందుకున్నప్పటికి ఆ తరువాత అనిత ఎక్కువగా క్లిక్కవ్వకలేకపోయింది. జయాపజయాలతో సంబంధం లేకుండా అటు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అనిత గతంలో ఒక గుడ్ న్యూస్ తో జనాలను అమితంగా ఆకట్టుకుంది. త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తన భర్తతో కలిసి అప్పట్లో ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

  మగబిడ్డకు జన్మనిచ్చిన అనిత

  మగబిడ్డకు జన్మనిచ్చిన అనిత


  రోహిత్ రెడ్డిని అనిత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్ళైన ఏడేళ్ళ అనంతరం వీరు ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు. బేబి బాయ్ అంటూ సోషల్ మీడియా ద్వారా రోహిత్ విషయాన్ని చెప్పాడు. దీంతో అనిత అభిమానులు శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  రెగ్యులర్ గా ఫొటో షూట్

  రెగ్యులర్ గా ఫొటో షూట్

  ప్రెగ్నెన్సీ మొదటి నుంచి కూడా అనిత జంట ప్రతి ముమేంట్ ను ఒక సెలబ్రేషన్ లా చేసుకుంది. రెగ్యులర్ గా ఫొటోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ వారి ఆనందాన్ని పంచుకున్నారు. భర్తకు లిప్ లాక్ కూడా ఇచ్చిన ఫొటోలను కూడా షేర్ చేసుకున్న అనిత అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యేలా చేసింది.

  బికినీలో లుక్ లో షాక్ ఇచ్చిన అనిత

  బికినీలో లుక్ లో షాక్ ఇచ్చిన అనిత


  రీసెంట్ గా అనితా మరోసారి ఫొటో షూట్ లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో ఏకంగా ఆమె బికినీ వేయడంతో ఫొటోలు నిమిషాల్లోనే వైరల్ గా మారాయి. ఇక భర్త రోహిత్ రెడ్డి బేబీ బంప్ పై ప్రేమను చూపిస్తూ భార్యను ముద్దాడుతున్న ఫొటోలు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

  సీరియల్స్ ద్వారా..బిజీగా

  సీరియల్స్ ద్వారా..బిజీగా


  కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ , హిందీ, మళయాళం, పంజాబీ భాషల్లో కూడా నటించిన అనిత హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక 2013లో బిజినెస్ మెన్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్న అనిత ఆ తరువాత సినిమాలకు కాస్త దూరంగానే ఉంటోంది. ఎక్కువగా సీరియల్స్ తో బిజీగా మారుతోంది. అలాగే పలు రియాలిటీ షోల ద్వారా కూడా అనిత మంచి క్రేజ్ అందుకుంటోంది.

  English summary
  Even if they do not grow up to be big star heroines, some heroines in the industry will not be easily forgotten by the people. Even those who did not make big budget movies received enough craze for life with just one or two movies. Anita Hassanandani is one of such heroines. Needless to say, the level of recognition I received with the film was special. Many days later, photos related to Anita's pregnancy went viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X