ఐటెమ్ సాంగ్స్ చేస్తుంటే.. అలా చూస్తున్నారు.. తమన్నా ఆవేదన

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రస్తుతం తన కెరీయర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. దీంతో కాస్తా రూటు మార్చి అందాల విందు చేస్తోంది. ఏకంగా స్పెషల్ సాంగ్స్ కే ప్రాధాన్యత ఇస్తూ వెండితెరపై దుమ్ములేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ స్పెషల్ సాంగ్స్ తో ఫ్యాన్స్, ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది. మరోవైపు బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. అయితే తమన్నా భాటియా తాజాగా మాత్రం నాగసాధువుగా ఓదెల 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా భిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదలైంది. 'రచ్చ' డైరెక్టర్ సంపత్ నంది కథను అందించడమే కాకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అంతే గ్రాండ్ గా ప్రమోషన్ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో తమన్నా భాటియా కూడా సినిమా ప్రమోషన్స్ బాధత్యలను తానై మోసి నడిపించింది. ఈ మూవీ టీజర్ ను ఏకంగా మహాకుంబ్ మేళా ప్రయాగ్ రాజ్ లో రిలీజ్ చేయడం మరో ప్రత్యేకమైన విషయం. కాగా సినిమా ప్రస్తుతం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మంచి రివ్యూనూ అందుకుంది.

Odela 2 Heroine Tamannaah Bhatia Shocking Comments about Special Songs

కాగా ఈ క్రమంలోనే తమన్నా భాటియా ప్రముఖ యాంకర్ రోషన్ తో ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా మిల్క్ బ్యూటీ తన గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ పైనా స్పందించింది. తమన్నా భాటియా మాట్లాడుతూ... స్పెషల్ సాంగ్స్ చేయడం నాకెప్పుడూ పెద్దగా తప్పు అనిపించలేదు. కానీ అందరూ ఐటెమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ అనగానే అదోక టైప్ లో చూస్తారు. నేను ఇప్పుడే కొత్తగా ఏమీ స్పెషల్ సాంగ్స్ చేయడం లేదు. 10 ఏళ్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా చేస్తూనే వస్తున్నాను.

ఎప్పుడైనా ఏ విషయాన్నైనా పరిధులను దాటి చూడగలగాలి. నేను అలా చూశాను. స్పెషల్ సాంగ్ అనేది ఒకరమైన ఎమోషన్ అంతే. చక్కిటి రూపం కలిగిన నేను ఆడటం ఇంకా మ్యాజిక్ గా అనిపిస్తుందని భావించాను. కానీ చాలా మంది మరోలా చూస్తున్నారు. అది సరికాదని నా అభిప్రాయం... అని చెప్పుకొచ్చింది. ఇక తమన్నా భాటియా టాలీవుడ్ హీరోలపైనా ఆసక్తికరంగా స్పందించింది. తను నటించిన స్పెషల్ సాంగ్స్ ల్లో ఇష్టమైన సాంగ్ గురించి కూడా చెప్పు కొచ్చింది. తమన్నా టాలీవుడ్ లో చాలానే స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం.

అయితే అందులో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించని 'స్వింగ్ జరా' సాంగ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఆ తర్వాత మహేశ్ బాలు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరూ'లోనూ నటించిన స్పెషల్ కూడా చాలా ఇష్టమని చెప్పారు. రీసెంట్ టైమ్స్ లో కావాలయ్యా, ఆజ్ కీ రాత్ మే సాంగ్స్ బాగా నచ్చాయని చెప్పింది. ఇక రీసెంట్ గా తమన్నా భాటియా బాలీవుడ్ లోని అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2 సినిమాలో స్పెషల్ సాంగ్ 'నషా' తో దుమ్ములేపింది. మే1న ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Read more about: tamannaah bhatia jr ntr odela 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X