For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోవిందా.. గోవిందా: శ్రీవారి దీవెనకోసం ఏడు కొండలెక్కిన సమంత

|

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మంగళవారం ఉదయం తిరుపమల శ్రీవారిని దర్శించుకున్నారు. గోవింద నామ స్మరణ చేస్తూ కాలినడకన ఏడుకొండలెక్కి దర్శనం చేసుకున్నారు. తన తాజా చిత్రం 'ఓ బేబీ' జులై 5న విడుదలవుతున్న నేపథ్యంలో వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదం కోసం చిత్ర బృందంతో కలిసి ఆమె తిరుమల వచ్చారు.

సమంత నటించిన గత చిత్రం 'మజిలీ' విడుదల సమయంలో కూడా ఆమె ఇదే తరహాలో కాలి నడకన కొండెక్కి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయం సాధించడంతో సమంత తిరుమలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.

 Oh! Baby release: Samantha Akkineni visit to Tirumala

స‌మంత ప్రధాన పాత్రలో నందీని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓ బేబీ'. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మించారు.

 Oh! Baby release: Samantha Akkineni visit to Tirumala

సమంతతో పాటు ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్, తేజ, ప్రగతి ప్ర‌ధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 5న ప్రేక్షకల ముందుకు రాబోతోంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో సమంత మాట్లాడుతూ... ఈ కథను మేము సెలక్ట్ చేసుకున్నాం అనడం కంటే ఆ కథే మమ్మల్ని సెలక్ట్ చేసుకున్నట్లు ఉంది. ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నాకు సంతోషం ఇచ్చింది. ఛాలెంజ్‌గా చేసేలా చేసిందని తెలిపారు.

English summary
Samantha Akkineni paid her visit to Tirumala today. She has been visiting the temple before the release of her films and this turned out to be a sentiment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more