twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: ఆ సీన్ చూసి కన్నీళ్ళు పెట్టుకున్న ఒలివియా.. ఆ హీరో అద్భుతంగా చేశాడు అంటూ..

    |

    టాలీవుడ్ లో సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన RRR సినిమా దేశవ్యాప్తంగా కూడా అత్యధిక వసూళ్లను అందుకునే సినిమాగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ వీకెండ్ లో కూడా సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అందుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా అద్భుతంగా నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటించగా ఎన్టీఆర్ కు సహనటిగా ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటించిన విషయం తెలిసిందే.

    ఓలీవియా బ్రిటిష్ అమ్మాయిగా సినిమాలో కనిపించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ ఒలివియా కు సంబంధించిన సన్నివేశాలు కూడా సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అంతేకాకుండా పాట చివరిలో ఓలివియా ఎంట్రీకి ఫాన్స్ విజిల్స్ కూడా వేశారు. ఆమె తెలుగులో మరిన్ని సినిమాలతో బిజీ అవ్వాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓలీవియా సినిమా రిజల్ట్ పై స్పందించింది. ఈ సినిమా ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది అనే దర్శకుడు రాజమౌళి అద్భుతమైన దర్శకుడు అనే ఆమె ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అద్భుతంగా నటించారని ముఖ్యంగా ఒక సన్నివేశం చూసిన ప్రతిసారి కూడా కన్నీళ్లు వస్తున్నాయని తెలిపింది.

    Olivia Morris emotional comments on jr ntr character in RRR

    జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీముడొ పాట లో చూపించిన హావభావాలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి అంటూ అందులో కొన్ని సన్నివేశాలకు కళ్లల్లో నీళ్లు తిరిగాయని వివరణ ఇచ్చింది. ఇక కొమరం భీముడో పాటకు తను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానని కూడా ఆమె తెలియజేసింది. ఇక RRR సినిమా కోసం తాను 20 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉన్నాను అని సినిమా షూటింగ్ గ్యాప్ లో కొన్ని హైదరాబాద్ లొకేషన్స్ కూడా చూసినట్లు తెలియజేసింది. ముఖ్యంగా శిల్పారామం తనకు చాలా బాగా నచ్చింది అని అక్కడ కొన్ని ప్రత్యేకమైన సిల్క్ దుస్తులను తన కుటుంబ సభ్యుల కు తీసుకు వెళ్లినట్లు చెప్పింది. ఇక నాటు నాటు పాట కూడా అద్భుతంగా వచ్చింది అని ఆ పాట తన బాయ్ ఫ్రెండ్ తో కూడా చేయించినట్లు గా ఒలీవియా మోరిస్ తెలియజేసింది.

    ఇక RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. చూస్తుంటే ఈ సినిమా మరో వారం పాటు ఇదే తరహాలో కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పట్లో ఈ సినిమాకు పోటీగా వచ్చే సినిమాలు అయితే పెద్దగా లేవు. మళ్ళీ ఏప్రిల్ 13 వ తేదీన విజయ్ బీస్ట్ సినిమా వస్తుండగా ఆ తర్వాత 14వ తేదీన మరొక పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ చాప్టర్ 2 రాబోతోంది. ఈ రెండు సినిమాలు వస్తే మాత్రం RRR సినిమా హవా పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పాలి. ఎన్ని కలెక్షన్స్ వచ్చిన అప్పటి లోపే రావాలి అని చిత్ర యూనిట్ సభ్యులు మరోసారి బజ్ పెరిగే విధంగా కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు.

    English summary
    Olivia Morris emotional comments on jr ntr character in RRR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X