మహేష్ సినిమాలో నాని హీరోయిన్.. నిత్యమీనన్ జస్ట్ మిస్?

నిత్యమీనన్ అదృష్టం ఏమిటో గాని చేతికొచ్చిన బంగారం లాంటి అవకాశాలను చాలానే మిస్ చేసుకుంటున్నట్లు ప్రస్తుతం మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. గతంలో వినూత్నమైన పాత్రలు వస్తే బయపడకుండా చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. మహానటిని రిజెక్ట్ చేయడమే కాకుండా ఆ తరువాత కరణం మల్లీశ్వరి బయోపిక్ కూడా రిజెక్ట్ చేసినట్లు టాక్ వచ్చింది.

అయితే అమ్మడి బ్యాడ్ లక్ కారణంగా చేతికొచ్చిన అవకాశాలు కూడా ఇటీవల మిస్ అయినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సర్కారు వారి పాటలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మొదట దర్శకుడు పరశురామ్ నిత్యమీనన్ ని అనుకున్నాడట. ఇంతకుముందు ఈ దర్శకుడు గీత గోవిందం సినిమాలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం నిత్యమీనన్ ని సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే.

Once again nitya menon missed the mahesh babu film

ఇక ఇప్పుడు అదే తరహాలో కథకి చాలా ముఖ్యమైన పాత్ర కోసం నిత్యమీనన్ ని అనుకోగా మళ్ళీ ఎందుకో మనసు మార్చుకున్నారట. చిత్ర యూనిట్ సలహా మేరకు ఆ సపోర్టింగ్ రోల్ కోసం నివేదా పేతురాజ్ అయితే కరెక్ట్ గా సెట్టవుతుందని ఆమెని ఫిక్స్ చేశారట. నాని V సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన నివేదా హీరోయిన్ గానే కాకుండా కథకు ప్రధాన్యమున్న చిన్న చిన్న పాత్రలలో కూడా నటిస్తోంది. మరి మహేష్ సినిమా ఈ బ్యూటీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X