నిజమే సుశాంత్‌తో డేటింగ్ చేశా.. కానీ ఆ తప్పు చేయలేదు: స్టార్ హీరోయిన్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధించిన డెత్ మిస్టరీలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి గాని అసలు విషయం బయటకు రావడం లేదు. సుశాంత్ కేసు చుట్టూ నెపోటిజమ్, డ్రగ్స్ వివాదం, ప్రేమ వ్యవహారం ఇలా అనేక రకాల ఆరోపణలు కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. ఇక స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇటీవల అతి ముఖ్యమైన విషయంలో ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ఇటీవల ఎన్సీబీ విచారణలో పాల్గొన్న విషయం తెలిసిందే..

 షూటింగ్ సమయంలోనే క్లోజ్ గా..

షూటింగ్ సమయంలోనే క్లోజ్ గా..

పీపింగ్‌మూన్.కామ్ కథనం ప్రకారం ఇప్పుడు బాలీవుడ్ లో సుశాంత్ కొత్త లవ్ స్టోరీకి సంబంధించిన స్టోరీలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సారా అలీ ఖాన్ తో సుశాంత్ కేదార్ నాథ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారని ఆ తరువాత డేటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి.

 అసలు నిజాన్ని ఒప్పుకున్న సారా

అసలు నిజాన్ని ఒప్పుకున్న సారా

ఇక సుశాంత్ సింగ్ స్నేహితుడు శామ్యూల్ కూడా సుశాంత్, సారా డేటింగ్ పై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. వాళ్ళిద్దరూ థాయిల్యాండ్ టూర్ కూడా వెళ్లినట్లు రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక ఫైనల్ గా ఇటీవల ఎన్సీబీ విచారణలో సారా అలీ ఖాన్ అసలు నిజాన్ని ఒప్పుకున్నారు తెలుస్తోంది. నిజానికి తనకు సిగరెట్ తప్ప మరొక అలవాటు లేదని ఆమె వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆ అలవాటు తప్ప మరొకటి లేదు

ఆ అలవాటు తప్ప మరొకటి లేదు

ఇక సుశాంత్ సింగ్ తో డేటింగ్ చేసిన మాట వాస్తవమేనని చెప్పిన సారా, థాయిల్యాండ్ కూడా వెళ్లినట్లు అధికారుల ముందు ఒప్పుకుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఆ ప్రేమ వ్యవహారం ఎక్కువ రోజులు కొనసాగలేదని చెప్పిందట. ఇక సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని చెప్పిన సారా తాను మాత్రం ఎప్పుడు కూడా వాటి జోలికి వెళ్లలేదని తెలిపినట్లు సమాచారం. తనకు సిగరెట్ అలవాటు తప్ప మరొక అలవాటు లేదని అధికారులకు పదే పదే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
డ్రగ్స్ తో మాకు సంబంధం లేదు

డ్రగ్స్ తో మాకు సంబంధం లేదు

సారా అలీ ఖాన్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనె వంటి స్టార్ హీరోయిన్స్ ఎన్సీబి డ్రగ్స్ విచారణలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఎవరికి వారు తమకు డ్రగ్స్ అలవాటు లేదని వివరణ ఇచ్చారు. అయితే సుశాంత్ కి మాత్రం డ్రగ్స్ అలవాటు ఉందని ఇందులో ఇద్దరు హీరోయిన్స్ అధికారులకు చాలా క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అధికారులు త్వరలోనే మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ ని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X