సాయిపల్లవి లాంటి జుట్టుకావాలంటే.. ఇలా చేయాలంట.
ఇసుమంతైనా మేకప్ లేకుండా టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సాయిపల్లవి, ఇప్పటికే మొటిమలు కూడా మంచివే అని నిరూపించింది. కనీసం వాటిని కవర్ చేసేందుకు కూడా ఇష్టపడని ఈ నేచురల్ బ్యూటీ, టాప్ బ్రాండ్స్ అయిన కాస్మెటిక్స్ యాడ్స్ ను నిరాకరించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక, అందమైన ఉంగరాల జుట్టుతో యువ హృదయాలను గింగిర్లు తిప్పుతున్న అమ్మడు, కేశ సంరక్షణ కోసం కొన్ని కిటుకులను చెప్పింది.
మంచి నడవడికతో ఆన్ స్క్రీన్ లోనే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ అందరి మనసులూ చూరగొంటున్న సాయి పల్లవి వీలైనంత సహజంగా ఉండేందుకే ఇష్టపడుతుంది. అందుకే స్వతహాగా తాను వాడని కాస్మెటిక్స్ కు ప్రచారం కూడా చేయబోనని కుండ బద్దలుగొట్టేసింది. అంతేకాదు, ఏ ఫెయిర్ నెస్ క్రీమ్ కూడా మొటిమలను తగ్గించవని స్పష్టం చేసింది. ఇక తన గిరిజాలకు కూడా సహజమైన పద్ధతిలోనే పోషణ అందిస్తున్నట్లు వెల్లడించింది.

తన ఆరోగ్యకరమైన, పొడవైన, ఒత్తైన జుట్టుకు కారణం తన ఆహారంలోనే ఉందంటోంది సాయి పల్లవి. ఆరోగ్యకరమైనవి మాత్రమే తినాలి అని సెలవిచ్చింది. అంతేకానీ, ఖరీదైన ఉత్పత్తులు, సెలూన్ లో ఖరీదైన ట్రీట్మెంట్లు చేయించుకోనని తెలిపింది. మంచి ఆహారం తీసుకుంటూ, మూడు రోజులకు ఒకసారి తలంటుకోవాలని తెలిపిన సాయి పల్లవి, దీంతో పాటూ, జుట్టు ఊడకూడదని రోజూ దేవుడిని ప్రార్థిస్తానని తెలిపింది.
డాన్సర్ గా రాణిస్తున్నప్పుడు తన జుట్టుకు రకరకాల కెమికల్ ఉత్పత్తులు వాడటం, కలరింగ్ చేసుకోవడం వల్ల, తన కురులు బాగా దెబ్బతినడంతో, వాటికి దూరంగా జరిగినట్లు వెల్లడించింది సాయి పల్లవి. ఇక అప్పటి నుంచి కురులకు సహజసిద్ధంగా లభించే కలబంద గుజ్జును మాత్రమే రాస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరి అమ్మడి టిప్స్ ను ఎంత మంది అమ్మాయిలు ఫాలో అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











