One month for Samantha divorce: గొప్ప పోరాటయోధురాలిని.. దేనికి తలవొగ్గను.. సమంత ఎమోషనల్ పోస్ట్

దక్షిణాదిలో స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య అక్కినేని విడాకులు తీసుకోవడం అందర్నీ షాక్ గురిచేసింది. కొద్ది నెలలుగా మీడియాలో వస్తున్న రూమర్లకు తెరదించుతూ అక్టోబర్ 2వ తేదీన తామిద్దరం వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నామని సమంత, నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే నవంబర్ 2వ తేదికి సమంత, నాగాచైతన్య విడాకులు తీసుకొని నెల రోజులైంది. ఈ నేపథ్యంలో తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో భావోద్వేగమైన పోస్టు పెట్టారు. ఆ పోస్టు వివరాల్లోకి వెళితే..

 ప్రతికూల పరిస్థితుల్లో అండగా నిలువండి..

ప్రతికూల పరిస్థితుల్లో అండగా నిలువండి..

చైతూతో విడాకుల తర్వాత ఎమోషనల్‌గా పోస్టు పెడుతూ.. దశాబ్దకాలంగా మా మధ్య మంచి స్నేహం ఉందని చెప్పడానికి అదృశ్యంగా భావిస్తున్నాను. అలాగే మా మధ్య స్పెషల్ బాండ్ ఉంది. ఇక ముందు కూడా మా మధ్య ఇలాంటి బంధమే కొనసాగుతుందని అనుకొంటున్నాను. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఫ్యాన్స్‌ను, సన్నిహితులను కోరుకొంటున్నాను. మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని వేడుకొంటున్నాను. ఇంతకాలం నన్ను ప్రోత్సహిస్తూ వెన్నంటి ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ అక్టోబర్‌లో సమంత పోస్టులో వెల్లడించారు.

 సమంత మానసికంగా మరింత దృఢంగా

సమంత మానసికంగా మరింత దృఢంగా

నాగచైతన్య నుంచి విడాకుల తీసుకొన్న తర్వాత సమంత మానసికంగా మరింత దృఢంగా కనిపిస్తున్నారు. స్పూర్తి దాయకమైన సందేశాలతో తన ఆలోచనలను, అభిప్రాయాలను ఘనంగా పంచుకొంటున్నారు. విడాకులు తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపబోదనే సంకేతాలను సమంత సోషల్ మీడియా ద్వారా వ్యక్తీకరిస్తున్నారు. సమంత చూపిస్తున్న మానసిక స్థిరత్వాన్ని చూసి అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

 రుషికేష్, ఛార్‌దామ్ యాత్రలో

రుషికేష్, ఛార్‌దామ్ యాత్రలో

ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత అధ్యాత్మిక చింతనకు లోనయ్యారు. ఉత్తరభారత దేశంలోని పుణ్యక్షేత్రాలను, అలాగే యోగా కేంద్రాలను సందర్శించారు. తన స్నేహితులతో కలిసి రుషికేష్, ఛార్‌దామ్ యాత్ర, విహార పర్యటనలు చేశారు. యమునోత్రి, గంగోత్రి, కేదారినాథ్, బద్రినాత్ లాంటి ప్రదేశాల్లో పర్యటించారు. ఆ ప్రాంతంలోని సరస్సుల్లో బోటింగ్ చేస్తూ మధురానుభూతులను ఆస్వాదించారు. ఇలా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

 దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై సమంత

దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై సమంత

సమంత తన ఒంటరి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారనే విషయం తన పర్యటనలతో స్పష్టమవుతున్నది. ఇటీవల తన టీమ్‌తో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బూర్జ్ ఖలీఫా భవనంలో సందడి చేశారు. అక్కడి లెబనాన్ రెస్టారెంట్‌లో సమయాన్ని గడిపారు. దుబాయ్ హోటల్‌లో తన అభిమానులు, సన్నిహితులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.

నేను పర్‌ఫెక్ట్ కాదు అంటూ

నేను పర్‌ఫెక్ట్ కాదు అంటూ

నవంబర్ 2వ తేదీకి విడాకులు తీసుకొని ఒక నెల పూర్తయిన సందర్భంగా ఎమోషనల్‌గా స్పందించారు. నేను స్ట్రాంగ్, నేను పర్‌ఫెక్ట్ కాదు. నాకు నేను ఫర్‌ఫెక్ట్, జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో ఒత్తిడికి గురికాను. దేనిని సులభంగా వదులుకోను. నన్ను నేను ప్రేమిస్తాను. నేను ధృఢమైన వ్యక్తిని, నాలో ఆవేశం ఉంది. నేను మంచి మనసున్న వ్యక్తిని, అన్నీటికంటే నేను గొప్ప పోరాటయోధురాలిని అంటూ పోస్టు పెట్టారు. ఇవన్నీ నేను అంటున్న మాటలు కాదు. నా గురించి అమ్మ చెప్పిన మాటలు అంటూ #mymommasaid హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారు.

Recommended Video

Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
 సమంత సినీ కెరీర్ ఇలా..

సమంత సినీ కెరీర్ ఇలా..

ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన చివరి సినిమా జాను. ఆ తర్వాత ఓటీటీలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతలం సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో కాథూ వాకులా రెండు కాదల్ చిత్రం, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌లో నిర్మాత కృష్ణ ప్రసాద్ నిర్మించే చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X