క్యూట్ హీరోయిన్ నాటు ప్రదర్శన.. గ్లామర్ షోకు సరైన అర్థం చెప్పేలా ఫోజులు

తెలుగు చిత్ర పరిశ్రమలో అందంతో మాయ చేసే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ హీరోయిన్ రుహానీ శర్మ ఒకరు. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తో మెప్పిస్తోన్న ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే రుహానీ శర్మ తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఏమాత్రం లేట్ లేకుండా వాటిని మీరే చూసేయండి మరి!

అలా సెన్సేషన్ అయింది
సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందే రుహానీ శర్మ మోడల్‌గా ఎనలేని గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి ఆల్బమ్స్‌లో కనిపించింది. వీటికి మంచి స్పందన రావడంతో రుహానీ సెన్సేషన్ అయిపోయింది. ఫలితంగా ఆమెకు అవకాశాలు భారీ స్థాయిలోనే లభించాయి.

 Operation Valentine Actress Ruhani Sharma Beautiful Photos Viral

ఆరంభంలోనే అవార్డుతో
ఆరంభంలోనే హైలైట్ అయిన రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని హైలైట్ అయిపోయింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో ఆమెకూ పేరు తెచ్చింది.

ఎన్నో మూవీల్లో నటించి
మొదటి చిత్రంతోనే నేషనల్ అవార్డు రావడంతో రుహానీ శర్మకు ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు లభించాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి అలరించింది. కానీ, ఇందులో హిట్ మినహా భారీ విజయాన్ని దక్కలేదు. దీంతో రుహానీ కెరీర్ ఆశించిన స్థాయిలో సత్తా చాటలేదు.

వరుణ్ తేజ్ మూవీలోనూ
అందంతో పాటు అభినయంలోనూ మెప్పిస్తోన్న రుహానీ శర్మ 2019లో 'పాయిజన్', తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌లోనూ చేసింది. అంతేకాదు, హిందీలో 'ఆగ్రా' మూవీ చేస్తోంది. ఇటీవలే తెలుగులో రుహానీ 'HER Chapter 1', 'సైంధవ్' మూవీలోనూ చేసింది. కానీ, ఇవి ఆమెకు అనుకున్న హిట్‌ను ఇవ్వలేదు. ఇప్పుడు 'ఆపరేషన్ వాలెంటైన్'తో రాబోతుంది.

అందులో యమ బిజీగా
హీరోయిన్‌గా రావడానికి ముందు నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న రుహానీ శర్మ.. హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత నుంచి మరింతగా ఇందులో యాక్టివ్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను షేర్ చేసుకుంటోంది.

 Operation Valentine Actress Ruhani Sharma Beautiful Photos Viral

గ్లామర్ షోతో మెప్పిస్తూ
రుహానీ శర్మ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో అందాలను ఆరబోస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన బోల్డు ఫొటోలు, వీడియోలు వదులుతూ సంచలనం అవుతోంది. ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఆమె ట్రెండింగ్‌లో ఉంటోంది.

అందాలతో వల వేస్తూ
కొంత కాలంగా డోస్ పెంచేస్తోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్యాజువల్ స్లీవ్‌లెస్ టాప్‌ను ధరించి విపరీతంగా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ యమ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X