సమంత, రష్మికకు ఎదురుదెబ్బ.. నెంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే ?

Top 10 heroines: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల క్రేజ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. మరోసారి ఆర్మాక్స్ మీడియా తాజా ర్యాంకింగ్స్ ద్వారా నిరూపితమైంది. ఈసారి మాత్రం భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా కాలంగా ఎవ్వరూ టచ్ చేయలేని నెంబర్ 1 స్థానంలో ఉన్న సమంతా రూత్ ప్రభు( SAMANTHA)కు షాక్ తగిలింది. ఆమె స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (ALIA BHATT) చేజిక్కిచుకుంది. ఈ సారి ఆలియా భట్ మొదటి స్థానాన్ని అందుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Also Read
పెద్దిలో ఆ ఎపిసోడ్ హైలైట్.. ఉప్పెన కంటే 100 రెట్లు ట్విస్ట్: రామ్ చరణ్
పెద్దిలో ఆ ఎపిసోడ్ హైలైట్.. ఉప్పెన కంటే 100 రెట్లు ట్విస్ట్: రామ్ చరణ్

గత కొన్ని నెలలుగా సమంత ఆర్మాక్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఆమె పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, సోషల్ మీడియాలో భారీ ఎంగేజ్‌మెంట్, అలాగే సినిమాల ఎంపిక అన్నీ కలిసి ఆమెను టాప్‌లో నిలిపాయి. కానీ ఈసారి పరిస్థితి మారింది. అలియాభట్ వరుస బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు, అంతర్జాతీయ గుర్తింపు, అలాగే పబ్లిక్ ఇమేజ్ కారణంగా భారీగా పాపులారిటీ సంపాదించి నంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకుంది.

Recommended For You
ఇక భరించేది లేదు.. పోలీసులను ఆశ్రయించిన బిగ్ బాస్ బ్యూటీ
ఇక భరించేది లేదు.. పోలీసులను ఆశ్రయించిన బిగ్ బాస్ బ్యూటీ
Ormax April 2026 Rankings Alia Bhatt Tops Samantha Rashmika Mandanna Drops Major Shakeup in List

ఇక సమంత ఒక్క స్థానం కిందకు జారిపడి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది ఆమె ఫ్యాన్స్‌కు పెద్ద షాక్‌గా మారింది. అయితే ఈ మార్పు తాత్కాలికమేనా? లేక ట్రెండ్ మారుతున్న సంకేతమా? అనే చర్చ మొదలైంది. మరోవైపు మూడో స్థానంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే (DEEPIKA PADUKONE) ఎంట్రీ ఇవ్వడం కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో మూడో స్థానంలో ఉన్న రష్మిక మందన్న(RASHMIKA MANDANNA) ఈసారి నాల్గో స్థానానికి పడిపోయాడు. రష్మిక ఇటీవల వ్యక్తిగత విషయాలు, పెళ్లి వార్తలతో ట్రెండ్‌లో కనిపించడం, ర్యాంకింగ్‌లో డౌన్‌లోడ్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

You May Also Like
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న బిగ్‌బాస్ కళ్యాణ్ పడాల.. కాబోయే భార్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న బిగ్‌బాస్ కళ్యాణ్ పడాల.. కాబోయే భార్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ (KAJAL AGGARWAL)తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ఆమె స్టేబుల్ క్రేజ్‌ను సూచిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ఫోటోషూట్స్ అన్నీ కలిసి ఆమెను టాప్ 5లో ఉంచాయి. ఆరో స్థానంలో సాయి పల్లవి (SAI PALLAVI) కూడా తన స్థానాన్ని కాపాడుకోవడం విశేషం. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం, భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న రామాయణ లో సీతా నటిస్తుండటం, సహజ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి.

ప్రేమ పేరుతో మోసం.. రోడ్లపై పిచ్చోడిలా తిరిగిన బుల్లితెర నటుడు
ప్రేమ పేరుతో మోసం.. రోడ్లపై పిచ్చోడిలా తిరిగిన బుల్లితెర నటుడు

ఇక ఏడో స్థానంలో నయనతార (NAYANTHARA)నిలవడం ఆమె స్టార్‌డమ్‌కు నిదర్శనం. లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన నయనతార, పోటీ ఎంత పెరిగినా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తునే ఉంది. ఇక టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ( SREELEELA)ఈసారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గత నెలలో 10వ స్థానంలో ఉన్న ఆమె, ఇప్పుడు ఎనిమిదో స్థానానికి ఎగబాకి తన క్రేజ్‌ను నిరూపించింది. యూత్‌లో పెరుగుతున్న ఫాలోయింగ్, వరుస ప్రాజెక్ట్‌లు ఆమె ర్యాంక్ పెరగడానికి కారణమయ్యాయి.

కో-డైరెక్టర్ కుట్ర..అలాంటి కష్టం ఎవరికీ రావొద్దు.. సీరియల్ హీరోయిన్ ఆవేదన
కో-డైరెక్టర్ కుట్ర..అలాంటి కష్టం ఎవరికీ రావొద్దు.. సీరియల్ హీరోయిన్ ఆవేదన

తొమ్మిదో స్థానంలో కృతి సనన్ (KRITI SANON)నిలవగా, చివర పదో స్థానంలో త్రిషా కృష్ణన్ (TRISHA) నిలవడం షాకింగ్‌గా మారింది. ఇటీవల ఆమెపై వచ్చిన వ్యక్తిగత వార్తలు, చర్చలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, ర్యాంకింగ్‌లో మార్పు చేయలేకపోయాయి. ఇలా మొత్తానికి ఈసారి ఓ ఆర్మాక్స్ జాబితా స్పష్టంగా ఒక సూచన చెబుతోంది. సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ స్థిరంగా ఉండదు. ప్రతి నెలా ప్రేక్షకుల అభిరుచులు, ట్రెండ్స్ మారుతుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లు ఆధిపత్యం చాటుతుండగా, టాలీవుడ్ హీరోయిన్లు గట్టి పోటీ ఇస్తున్నారు. రాబోయే నెలల్లో ఈ ర్యాంకింగ్స్ ఎలా మారతాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X