Top Heroines: టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. సమంత, నయనతార, రష్మిక, శ్రీలీల ఏ స్థానంలో ఉన్నారంటే?

ప్రముఖ మీడియా రీసెర్చ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా (Ormax Media) ప్రతి నెల హీరోలు,హీరోయిన్లకి సంబంధించిన టాప్‌ 10 జాబితాని విడుదల చేసే విషయం తెలిసిందే. అలా తాజాగా జనవరి నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్‌ టాప్‌ 10 హీరోయిన్ల జాబితాని ఓర్మాక్స్ మీడియా ప్రకటించింది. ఈ ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ అనే పేరిట జనవరి జాబితాను వెల్లడించింది. అయితే.. ఈ జాబితా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జాబితా ప్రకారం.. మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరు? ఏ హీరోయిన్ ఏ స్థానంలో నిలిచింది? అనే వివరాల్లోకెళ్తే..

ప్రతి నెల దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిరుచులు, సోషల్ మీడియా రీచ్‌, తాజా సినిమాల ప్రభావం, బ్రాండ్ వ్యాల్యూ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఓర్మాక్స్ ఈ ర్యాంకింగ్స్‌ను సిద్ధం చేస్తుంది. జనవరి నెలకు సంబంధించిన తాజా లిస్ట్‌లో సౌత్ హీరోయిన్ల ఆధిపత్యం మరోసారి స్పష్టంగా కనిపించింది.మోస్ట్ పాపులర్‌ టాప్‌ 10 హీరోయిన్ల జాబితాలో సమంత రూత్ ప్రభు, ఆలియా భట్, నయనతార, త్రిష కృష్ణన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొనే, సాయి పల్లవి, శ్రీలీల, తమన్నా భాటియాలు చోటు సంపాదించుకున్నారు.

Ormax January 2026 Top 10 Heroines Samantha No 1 Nayanthara-Trisha Rise Rashmika Drops

సమంత వరుసగా టాప్‌లోనే!
ఈ లిస్ట్‌లో మరోసారి సమంత నెంబర్‌ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత కొన్ని నెలలుగా ఆమెకు పోటీ ఇవ్వగల హీరోయిన్ కనిపించడం లేదు. సినిమాలు తగ్గించినా... వెబ్ సిరీస్‌లు, సోషల్ మీడియా క్రేజ్‌, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్ ఆమెను టాప్‌లో నిలబెట్టాయి. ఇండస్ట్రీలో 'లేడీ సూపర్ స్టార్' అనే ట్యాగ్‌ను కొనసాగిస్తోంది సమంత.

నయనతార-త్రిష దూకుడు
మూడో స్థానంలో నయనతార, నాల్గో స్థానంలోత్రిష నిలవడం విశేషం. డిసెంబర్‌తో పోలిస్తే ఇద్దరూ భారీగా మెరుగుపడ్డారు. ముఖ్యంగా నయనతార రెండు స్థానాలు ఎగబాకగా, త్రిష 3వ స్థానంలోకి వచ్చింది. తాజా సినిమాల విజయం, సోషల్ మీడియాలో పెరిగిన చర్చలు వీరి ర్యాంక్ పెరగడానికి కారణమయ్యాయి.

రష్మిక, దీపికా షాక్!
నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మిక మందన్నా డిసెంబర్‌లో మూడో స్థానంలో ఉండగా... ఈసారి ఐదో స్థానానికి పడిపోయింది. అలాగే బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నాలుగో స్థానం నుంచి ఏడో స్థానానికి చేరడం అభిమానులకు షాకిచ్చింది. తాజా రిలీజులు లేకపోవడం, కొత్త ప్రాజెక్టుల అప్‌డేట్స్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సాయి పల్లవి స్ట్రాంగ్, శ్రీలీల హైప్..
ఎనిమిదో స్థానంలో సాయి పల్లవి నిలిచింది. గత కొన్ని నెలలుగా ఆమె స్థానం పెద్దగా మారడం లేదు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది. తొమ్మిదో స్థానంలో ఉన్న శ్రీలీల గత నెలతో పోలిస్తే ఒక స్థానం మెరుగుపడింది. యంగ్ హీరోల సినిమాలతో పాటు స్టార్ ప్రాజెక్ట్స్ ఆమె క్రేజ్‌ను పెంచుతున్నాయి.

తమన్నా ఎంట్రీ- అనుష్క ఔట్!
పదో స్థానంలో తమన్నా భాటియా తొలిసారి ఈ లిస్ట్‌లోకి రావడం విశేషం. గతంలో ఈ స్థానంలో ఉన్న అనుష్క ఈసారి పూర్తిగా లిస్ట్‌కు దూరమైంది. ఈ ర్యాంకింగ్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా వైడ్‌గా సౌత్ హీరోయిన్ల డామినేషన్ కొనసాగుతోంది. సమంత నుంచి తమన్నా వరకు ఏడుగురు సౌత్ హీరోయిన్స్ టాప్‌ 10లో ఉండటం దక్షిణాది సినిమా ప్రభావాన్ని చాటుతోంది. మరోవైపు బాలీవుడ్ నుంచి ఆలియా భట్, దీపికా మాత్రమే టాప్ లిస్ట్‌లో నిలవగలిగారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X