Top Heroines: టాప్ 10 హీరోయిన్స్ వీరే! చెక్కుచెదరని సమంత స్థానం

భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులు ఎవరు? ప్రతి నెలా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ప్రశ్న ఇదే. ఈ ఆసక్తికి తెరదిస్తూ ప్రముఖ మీడియా అనలిటిక్స్ సంస్థ ఓర్మాక్స్ మీడియా (Ormax Media) తాజాగా మార్చి 2026కు సంబంధించిన మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ (Most Popular Female Film Stars in India) జాబితాను విడుదల చేసింది. ఈసారి కూడా ఈ జాబితాలో దక్షిణాది హీరోయిన్ల హవా స్పష్టంగా కనిపించగా, బాలీవుడ్ తారలు కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన నటీమణులు ఈ టాప్ 10లో సత్తా చాటడం విశేషంగా మారింది.

ఎప్పటిలాగే ఈసారి కూడా అగ్రస్థానంలో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)నిలిచారు. వరుసగా తన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్‌గా మరోసారి నిరూపించుకున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా సమంత స్థానం చెక్కుచెదరలేదు. అభిమానుల్లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఎంత బలంగా ఉందో ఈ జాబితా మరోసారి స్పష్టం చేసింది.

Ormax Media Top 10 Heroines March 2026 Samantha Leads Rashmika and Sreeleela Shine

రెండో స్థానంలో అలియా భట్ (Alia Bhatt) నిలిచారు. బాలీవుడ్‌లో వరుస విజయాలతో పాటు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించిన అలియా తన స్థాయిని నిలబెట్టుకున్నారు. ఇక మూడో స్థానంలో రష్మిక మందన్న (Rashmika Mandanna) నిలవడం విశేషం. నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక ఇటీవల వ్యక్తిగత విషయాలతో పాటు కొత్త సినిమాల కారణంగా ట్రెండింగ్‌లో ఉండటంతో టాప్ 3లో చోటు దక్కించుకుంది. నాలుగో స్థానంలో దీపిక పడుకోణె(Deepika Padukone) నిలిచారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న దీపికకు పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫాలోయింగ్ ఉంది.

ఇక ఐదో స్థానంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)నిలవడం ఆసక్తికరం. ఇటీవలి కాలంలో పెద్దగా సినిమాలు లేకపోయినా అభిమానుల్లో కాజల్‌కు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ఇది సూచిస్తోంది. ఇక ఆరో స్థానంలో సాయి పల్లవి (Sai Pallavi)నిలిచారు. సహజ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన సాయి పల్లవి త్వరలో భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా రామాయణ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏడో స్థానంలో నయనతార (Nayanthara) నిలిచారు. లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన నయనతారకు ఇది కొంత నిరాశ కలిగించే స్థానం అయినప్పటికీ, టాప్ 10లో స్థానం నిలుపుకోవడం మాత్రం విశేషమే.

ఎనిమిదో స్థానంలో త్రిష (Trisha Krishnan)నిలిచారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటికీ క్రేజ్‌ను నిలబెట్టుకోవడం త్రిష ప్రత్యేకతగా చెప్పాలి. తొమ్మిదో స్థానంలో కృతి సనన్ (Kriti Sanon)నిలిచారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కృతి పాన్ ఇండియా ప్రాజెక్టులతో మరింత గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక చివరిగా పదో స్థానంలో శ్రీలీల (Sreeleela) నిలిచారు. ఇటీవల యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన శ్రీలీల, ముఖ్యంగా డ్యాన్స్ నంబర్లతో, వరుస అవకాశాలతో టాప్ 10లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. కొత్త తరం హీరోయిన్లలో ఆమె దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇలా మొత్తం మీద ఈసారి ఓర్మాక్స్ మీడియా జాబితాలో దక్షిణాది హీరోయిన్లే ఆధిపత్యం చాటారు. టాప్ 10లో సమంత, రష్మిక, కాజల్, సాయి పల్లవి, నయనతార, త్రిష, శ్రీలీల వంటి సౌత్ ఇండియన్ స్టార్స్ నిలువడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అభిమానుల అభిరుచి, సోషల్ మీడియా హవా, సినిమాల ప్రభావం అన్ని కలిపి ఈ ర్యాంకింగ్స్ రూపుదిద్దుకున్నాయి. వచ్చే నెల ఈ జాబితాలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X