Top 10 Heroines: టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ వీళ్లే... శ్రీలీల, సమంత, రష్మిక ఏ స్థానాల్లో ఉన్నారంటే?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటి కప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే టాప్ 10 హీరోలు ఎవరో వెల్లడించింది. తాజాగా టాలీవుడ్ లో టాప్ 10 హీరోయిన్లు వీరే అంటూ ఓ లిస్టును రిలీజ్ చేసింది. అక్టోబర్, 2023కి సంబంధించిన జాబితాను ఆర్మాక్స్ మీడియా తన సోషల్ మీడియా వేదికగా లిస్టును రిలీజ్ చేసింది. ఇక అందులో ఎప్పటిలాగా సమంత మొదటి స్థానం దక్కించుకుంది. మిగతా హీరోయిన్లు ఎవరు ఏ స్థానంలో నిలిచారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలుగు టాప్ హీరోయిన్లు ఎవరు అంటే... ఎవరైనా తమకు నచ్చిన హీరోయిన్ పేరు చెబుతూ ఉంటారు. ఎవరికి వాళ్లే మా హీరోయిన్ గొప్ప అంటే.. మా హీరోయిన్ గొప్ప అంటూ ఉంటారు. ఇక ఈ సమస్యకు ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ పరిష్కరం చూపించింది. సోషల్ మీడియాలో, జనాల్లో, సినిమాలతో ఎవరు టాప్ లో ఉంటారో వారి లిస్టు తయారు చేసి.. ప్రతి నెల రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆర్మాక్స్.

 Ormax Most Popular Femali Telugu Film Stars October 2023 Samantha, Sreeleela, Rashmika Full List Here

ఇక ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎప్పటి కప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్లు వీరే అంటూ ఓ జాబితాను రిలీజ్ చేసింది. ఇక ఈ జాబితాలో ఎప్పటిలాగానే సమంత రుత్ ప్రభు మొదటి స్థానం దక్కించుకుంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా... ఈ భామ మాత్రం టాప్ లోనే ఉంటుంది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది సమంత.

ఇక టాప్ 2 హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ దక్కించుకుంది. కాజల్ ఇటీవల భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ తర్వాతి స్థానంలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల దక్కించుకుంది. ఇక శ్రీలీల కింది స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చింది. ఇక టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అంతే కాదు ఈ భామ చేతిలో డజను సినిమాలు ఉన్నాయి. నెలకో సినిమాతో ఈ భామ ప్రేక్షకులను పలకరిస్తునే ఉంది.

 Ormax Most Popular Femali Telugu Film Stars October 2023 Samantha, Sreeleela, Rashmika Full List Here

ఇక నాలుగో స్థానంలో అనుష్క శెట్టి, ఐదో స్థానంలో సాయి పల్లవి నిలిచారు. అయితే ఇటీవల అనుష్క శెట్టి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో వచ్చింది. ఇక సాయి పల్లవి సినిమాలు చేయకపోయినా.. ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఇక ఆరవ స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నిలిచింది. ఈ భామ ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. త్వరలో యానిమల్ అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఏడవ స్థానంలో కీర్తి సురేష్ నిలిచింది. ఈ భామకు తెలుగులో అంతకలిసి రాకపోయినా.. టాప్ హీరోయిన్లలో కొనసాగుతుంది. ఇటీవల ఈ భామ మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఎనిమిదో స్థానంలో తమన్నా బాటియా నిలిచింది. ఈ భామ ఇటీవల బోళా శంకర్, జైలర్ సినిమాలతో అలరించింది. ఇక హిందీలోనూ తన సత్తా చాటుతూ సినిమాలు చేస్తుంది.

 Ormax Most Popular Femali Telugu Film Stars October 2023 Samantha, Sreeleela, Rashmika Full List Here

ఇక తొమ్మిదో స్థానంలో పూజా హెగ్డే నిలిచింది. ఈ భామకు తెలుగులో ప్రస్తుతం సినిమాలు లేవు. కానీ ఈ భామ తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. ఇక పదో స్థానంలో అనుపమ పరమేశ్వరన్ నిలిచింది. ఇక టాప్ 5 హీరోయిన్లుగా సమంత, కాజల్, శ్రీలీల, అనుష్క, సాయి పల్లవి ఉన్నారు. ఇక అదండి అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్ జాబితా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X