మళ్లీ టాప్ లేపిన సమంత రుత్ ప్రభు.. దీపిక, అలియా, నయనతారను మించి..

ఇటీవల కాలంలో హీరో హీరోయిన్స్ పోటాపోటీగా జనాల్లో మంచి క్రేజ్ అందుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇక డిజిటల్ సోషల్ మీడియా ఆధారంగా సర్వేలు నిర్వహించే ఓరామ్యాక్స్ సంస్థ తరచుగా ప్రతి నెలలో ఒకసారి స్టార్స్ కు సంబంధించిన ర్యాంకులను విడుదల చేస్తూ ఉంటుంది. ఇక 2002 డిసెంబర్లో ఏ హీరోయిన్ ఏ స్థానంలో నిలిచింది అనే ర్యాంక్స్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ వివరాలలోకి వెళితే..

సమంత టాప్ లో..

సమంత టాప్ లో..

ఓరా మాక్స్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లో ఈసారి కూడా పోటీ గట్టిగానే జరిగింది. అయితే అందరికంటే ఎక్కువ స్థాయిలో మరోసారి సమంత అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఆమెకు సంబంధించిన యశోద సినిమాతో పాటు శాకుంతలం సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఆమె మొదటి స్థానంలో నిలవగా తర్వాత స్థానంలో ఆలియా భట్ నిలిచింది. ఆలియా భట్ తన తదుపరి సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలతో కూడా ఆమె వైరల్ అయిన విషయం తెలిసిందే.

 నయనతార, దీపిక

నయనతార, దీపిక

ఇక మూడో స్థానంలో నయనతార నిలవడం విశేషం. ఎప్పుడు కూడా 5వ స్థానం తర్వాత ఉంటున్న నయనతార ఈసారి సినిమాలు కంటే ఎక్కువగా తన పర్సనల్ విషయాలతో మరోసారి వైరల్ గా మారింది. ఇక ఆమె తర్వాత ఈ సర్వేలో 4వ స్థానంలో దీపికా పదుకొనే ఉండడం విశేషం. ఈ బ్యూటీ పటాన్ సినిమాకు సంబంధించిన బికినీ కాంట్రవర్సీ విషయాలతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.

కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న

కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న

అయితే ఊహించని విధంగా ఈ సర్వేలో కాజల్ అగర్వాల్ ఐదవ స్థానాన్ని సంపాదించుకుంది. ఆమెకు సంబంధించిన సినిమాలు లేకపోయినప్పటికీ కూడా గ్లామరస్ ఫోటోలు మాత్రం పోస్ట్ చేసినప్పుడు బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక కాజల్ తర్వాత శ్రీవల్లి రష్మిక మందన్న మరోసారి తన స్టారీ హోదా ఏంటో నిరూపించుకుంది. ఈ బ్యూటీ కూడా వివిధ రకాల కాంట్రవర్సీలతో ఈ మధ్య బాగానే వైరల్ అయింది. దీంతో 6వ స్థానంలో నిలిచింది.

 కత్రినాకైఫ్, త్రిష

కత్రినాకైఫ్, త్రిష

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ స్థానం మరోసారి తగ్గిపోయింది. ఈ బ్యూటీ డిసెంబర్ నెలలో తన భర్తకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసి కొంత హడావిడి చేసింది. ఇక ఆమె తర్వాత సీనియర్ హీరోయిన్ త్రిష ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నా కూడా త్రిష మాత్రం తన క్రేజ్ ను అసలు తగ్గించుకోవడం లేదు. PS 1 సినిమాతో ఈ బ్యూటీ గత కొన్ని నెలలుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది.

 చివర్లో తమన్నా, కీర్తి

చివర్లో తమన్నా, కీర్తి

ఇక టాప్ టెన్ లిస్టులో చివరి స్థానాల్లో 9వ ర్యాంకును తమన్నా భాటియా సంపాదించుకుంది. ఈ బ్యూటీ కూడా వివిధ రకాల గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాను బాగానే షేక్ చేస్తోంది. ఈమధ్య తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య కూడా ఒకసారిగా పెరిగిపోయారు. ఇక పదవ స్థానంలో కీర్తి సురేష్ నిలిచింది. ఈ బ్యూటీ ఊహించిన విధంగా ఈ మధ్య కూడా కొన్ని గ్లామరస్ ఫోటోలతో ఫాలోవర్స్ కు ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే ఆమెకు సంబంధించిన సినిమాలు అప్డేట్స్ కూడా మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X