twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    India's Most Popular Heroines: బాలీవుడ్ స్టార్స్‌ను డామినేట్ చేసిన సమంత.. టాప్ 10 లిస్ట్‌లో పెళ్ళైన హీరోయిన్స్

    |

    ఇటీవల కాలంలో స్టార్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా హీరోయిన్స్ కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నారు అనే చెప్పాలి. ఇక తరచుగా ఇంటర్నెట్ డిజిటల్ మీడియా సర్వేల ద్వారా ర్యాంక్ లను అనౌన్స్ చేసే ఓరామాక్స్ సంస్థ ఇటీవల మరోసారి ఇండియా మొత్తంలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్టును విడుదల చేసింది. ఇక ఈ లిస్టులో పెళ్లయిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇక అందరికంటే ఎక్కువ స్థాయిలో సమంత కూడా క్రేజ్ అందుకోవడం విశేషం. ఇక మొత్తంగా అక్టోబర్ 2022 సర్వే ప్రకారం ఏ హీరోయిన్ ఏ స్థానంలో ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే..

    సమంత నెంబర్ వన్

    సమంత నెంబర్ వన్

    ఈసారి నెంబర్ వన్ స్థానంలో సమంత చోటు తగ్గించుకోవడం విశేషం. ఇండియా మొత్తంలో కూడా ఆమె పేరు ఇటీవల మారు మ్రోగిపోయింది. ముఖ్యంగా యశోద సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో సమంతా బ్రాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఒరామాక్స్ సర్వేలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆమె తర్వాత రెండవ స్థానంలో ఆలియా భట్ కొనసాగుతోంది.

    నయనతార, కాజల్ అగర్వాల్

    నయనతార, కాజల్ అగర్వాల్

    ఇక నయనతార పెళ్లి అయిన తర్వాత కూడా తన క్రేజ్ ను ఏమాత్రం తగ్గించుకోలేదు. తరచుగా ఆమె తన భర్తకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక అక్టోబర్ నెలలో మూడవ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఆమె తర్వాత నాలుగవ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది. కాజల్ తల్లి అయిన తర్వాత కూడా ఇంతకుముందు ఎలాగైతే క్రేజ్ అందుకునేదో ఇప్పుడు కూడా అదే తరహాలో ఫ్యాన్ ఫాలోవర్స్ లో పెంచుకుంటుంది. దీంతో ఓరామాక్స్ సర్వేలో ఆమె నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

    దీపికా, రష్మిక మందన్న

    దీపికా, రష్మిక మందన్న

    ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ లలో దీపికా పదుకొనే ఒకరు. ఆమె ఓరామాక్స్ సర్వేలో ప్రతిసారి కూడా టాప్ 5 లిస్టులో కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఆమె ఐదవ స్థానంలో చోటు సంపాదించుకుంది. ఇక ఆమె తర్వాత 6వ స్థానంలో ఈసారి రష్మిక మందన్న నిలిచింది. ఈ బ్యూటీ కూడా ఇటీవల వివిధ రకాల విషయాలతో డిజిటల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

    కత్రినా కైఫ్, అనుష్క శెట్టి

    కత్రినా కైఫ్, అనుష్క శెట్టి

    ఇక 7వ స్థానంలో కత్రినా కైఫ్ నిలవడం విశేషం. తన రెగ్యులర్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాకుండా గ్లామరస్ ఫోటోలతో కూడా ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. పెళ్లి తర్వాత కూడా అదే తరహా క్రేజ్ అందుకోవడం విశేషం. ఇక ఓరామాక్స్ సర్వేలో మరోసారి అనుష్క శెట్టి కూడా టాప్ టెన్ లిస్టులో నిలవడం విశేషం. ఇప్పుడు అక్టోబర్ నెలలో ఆమె తన న్యూ లుక్కుతోనే సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయింది. దీంతో ఈ సర్వేలో 8వ స్థానంలో నిలిచింది.

    కీర్తి సురేష్, త్రిష

    కీర్తి సురేష్, త్రిష

    ఇక టాప్ 10 లో చివరి రెండు స్థానాల్లో సౌత్ బ్యూటీలే నిలవడం విశేషం. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ మంచి క్రేజ్ అందుకుంటుంది. ఓరామాక్స్ సర్వేలో అక్టోబర్ నెలలో ఆమె 9వ ర్యాంకును సంపాదించుకుంది. ఇక ఆమె తర్వాత 10వ స్థానంలో త్రిష కృష్ణన్ నిలవడం విశేషం. త్రిష పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాతో మరోసారి తన క్రేజ్ ను పెంచుకుంది. దీంతో ఈ సర్వేలో ఆమెకు 10వ స్థానం దక్కింది. మరి రాబోయే రోజుల్లో ఈ హీరోయిన్స్ వారి స్థానాలను ఇంకా ఏ రేంజ్ కు పెంచుకుంటారో చూడాలి.

    English summary
    Ormax stars india 2022 October Most Popular Female Stars in india
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X