Most Popular Female Stars: మరోసారి టాప్ లిస్టులో సీనియర్ బ్యూటీస్.. వారికి పోటీగా సాయి పల్లవి
మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్టులో మరోసారి చాలా మంది హీరోయిన్ల స్థానాలు మారిపోయాయి. గత రెండు మూడు నెలల క్రితం అగ్రస్థానంలో ఉన్నవారు ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా ఐదవ స్థానంకు పడిపోయారు. ఇక డిజిటల్ సోషల్ మీడియా ఆధారంగా సర్వేలు నిర్వహించే ఓరామాక్స్ సంస్థ అక్టోబర్ నెలలో నిర్వహించిన సర్వేలో టాప్ 10 స్థానాలలో నిలిచిన హీరోయిన్ల ర్యాంక్స్ విడుదల చేసింది. ఇక మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్టులో టాలీవుడ్ నుంచి ఎవరెవరు టాప్ 10 లో నిలిచారు అనే వివరాల్లోకి వెళితే..

టాప్ లో సమంత, కాజల్
ఇక మొదటి స్థానంలో ఈసారి సమంత రుత్ ప్రభు నిలిచింది. ఆమె యశోద సినిమా ద్వారా గత నెల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇక ఆమె తర్వాత కాజల్ అగర్వాల్ రెండవ స్థానంలో నిలిచింది. తల్లి అయిన తర్వాత కూడా కాజల్ గ్లామరస్ అందాలతో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఆమెకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు కూడా చర్చలో దశలో ఉండడంతో ఇంటర్నెట్ ప్రపంచంలో పేరు బాగా వైరల్ అయింది. దీంతో ఈసారి రెండో స్థానంలో చోటు సంపాదించుకుంది.

అనుష్క శెట్టి - సాయి పల్లవి
అనుష్క శెట్టి నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అయినప్పటికీ కూడా ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆమె 3వ స్థానంలో నిలిచింది. ఇక సాయి పల్లవి మరోసారి ఎప్పటిలానే తన స్టార్ హోదాను నిరూపించుకుంది. ఆమె కూడా ఇటీవల కాలంలో పెద్దగా సినిమాలో ఆకట్టుకుంది లేదు. అయినప్పటికీ అక్టోబర్ నెలలో ఆమె ఈ సర్వేలో 4వ స్థానంలో చోటు సంపాదించుకుంది.

టాప్ 5లో బుట్టబొమ్మ
ఓరామ్యాక్స్ టాప్ 5 లిస్టులో ప్రతీసారి పూజా హెగ్డే అయితే తప్పకుండా ఒక స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఇక ఈసారి బుట్ట బొమ్మ దగ్గర మరికొందరికి పోటీగా డామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆమె తర్వాత 6వ స్థానంలో మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన నిలిచింది. ఈ బ్యూటీ ఇటీవల సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ పై క్లారిటీ ఇచ్చిన విధానం బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.

మహానటి 7వ స్థానంలో
ఇక కీర్తి సురేష్ తన స్థానాన్ని మరింత పెంచుకోవాలని అనుకుంది. ఈసారి ఓరామాక్స్ సర్వేలో ఆమె ఏడవ స్థానంలో నిలిచింది. తమిళ్ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న కీర్తి సురేష్ కు సంబంధించిన ఫోటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక తమన్నా భాటియా ఎక్కువగా గ్లామరస్ ఫోటోషూట్స్ తోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఈ సర్వేలో ఆమె 8వ స్థానంలో నిలిచింది.

టాప్ 10లో అనుపమ
మరో బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి అగ్ర హీరోయిన్స్ కు పోటీని ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ మళ్ళీ ఆమెకు వెంట వెంటనే డిజాస్టర్స్ వస్తున్నాయి. ఇక ఈసారి సర్వేలో ఆమె స్థాయి కొంచెం తగ్గినట్లు అనిపించింది. ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది. ఇక 10వ స్థానంలో మలయాళం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నిలిచింది. ఈమెకు తెలుగులో మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇటీవల కార్తికేయ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











