Most Popular Female Stars: ఈసారి బుట్టబొమ్మ, రష్మిక రేంజ్ డౌన్.. మొదటి స్థానంలో ఎవరంటే?

ఓరామాక్స్ సంస్థ ఫిబ్రవరి నెలలో నిర్వహించిన సర్వేలో టాప్ 10 స్థానాలలో నిలిచిన హీరోయిన్ల ర్యాంక్స్ విడుదల చేసింది. మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్టులో మరోసారి చాలా మంది హీరోయిన్ల రేంజ్ మారిపోయింది. ఇక గత రెండు మూడు నెలల క్రితం అగ్రస్థానంలో ఉన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే, రష్మిక మళ్ళీ ఒక్కసారిగా డౌన్ అయ్యారు. ఇక ఓరామ్యాక్స్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్టులో టాలీవుడ్ నుంచి ఎవరెవరు టాప్ 10 లో నిలిచారు అనే వివరాల్లోకి వెళితే..

 సమంత - కాజల్

సమంత - కాజల్

సమంత యశోద సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు శకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక సమంత కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంటుంది.

ఇక ఈ బ్యూటీ ఈసారి నెంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం. ఇక రెండవ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది. పెళ్లయిన తర్వాత కూడా పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ కూడా కాజల్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకుంటుంది. ఇక ఓరామాక్స్ లో ఆమె ఈసారి సెకండ్ ర్యాంక్ అందుకోవడం విశేషం.

సాయి పల్లవి - అనుష్క శెట్టి

సాయి పల్లవి - అనుష్క శెట్టి

ఇక సినిమాలు వచ్చిన రాకపోయినా కూడా సాయి పల్లవి రేంజ్ అసలు తగ్గడం లేదు. ఆమె రకరకాల సినిమాలలో నటిస్తోంది అని గాసిప్స్ ద్వారానే పేరు బాగా వైరల్ అయిపోయింది. ఇక ఓరామ్యాక్స్ సర్వేలో ఈ బ్యూటీ మూడవ స్థానంలో ర్యాంక్ అందుకోవడం విశేషం. ఇక అనుష్క శెట్టి నుంచి చాలా రోజుల తర్వాత ఒక సినిమా అప్డేట్ వచ్చింది.

మిస్ శెట్టి మిస్టర్ శెట్టి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాతో ఆమెకు మళ్ళీ ఒక్కసారిగా గుర్తింపు పెరిగిపోయింది. దీంతో అనుష్క నాలుగో స్థానంలో చోటు సంపాదించుకుంది.

పూజా హెగ్డే - రష్మిక మందన్న

పూజా హెగ్డే - రష్మిక మందన్న

అయితే ఈసారి పూజా హెగ్డే రష్మిక మందన్న రేంజ్ ఒక్కసారిగా తగ్గిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీళ్లిద్దరూ కూడా గత ఏడాది చాలావరకు ఓరామ్యాక్స్ సర్వేలో మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చారు. అయితే ఈసారి పూజా అయితే ఐదవ స్థానానికి పడిపోగా రష్మిక మందన్న 6వ స్థానంలో చోటు సంపాదించుకుంది. వీరి తదుపరి సినిమాలు ఏమైనా సక్సెస్ అయితే మాత్రం మళ్ళీ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది.

తమన్నా - కీర్తి సురేష్

తమన్నా - కీర్తి సురేష్

ఇక మిల్కీ బ్యూటీ తమన్న కూడా ఇటీవల కాలంలో తన గ్లామర్ తో ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఓరామ్యాక్స్ సర్వేలో ఈ బ్యూటీ ఏడవ ర్యాంకు సొంతం చేసుకుంది. ఇక ఆమె తర్వాత కీర్తి సురేష్ 8వ స్థానం సంపాదించుకోవడం విశేషం. ఈ బ్యూటీ కూడా గతంలో కొంత హై రేంజ్ లోనే ర్యాంక్స్ అందుకుంటూ వచ్చింది. కానీ ఈసారి 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

శ్రీలీల - అనుపమ

శ్రీలీల - అనుపమ

ఇక ఇటీవల కాలంలో వరస విజయాలతో దూసుకుపోతున్న వారిలో శ్రీలీల ఒకరు. ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో తన రేంజ్ ను మరింత పెంచుకుంటుంది అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె చేతిలో అలాంటి ఆఫర్లు ఉన్నాయి. ఇక శ్రీలీల ఓరామ్యాక్స్ సర్వేలో ఫిబ్రవరి నెలలో బాగా వైరల్ అవ్వడంతో ఆమెకు తొమ్మిదవ ర్యాంక్ తగ్గింది. ఇక అనుపమ పరమేశ్వరన్ పేరు కూడా గత నెలలో బాగా ట్రెండ్ అయింది. ఇక ఈ బ్యూటీ కూడా గ్లామర్ డోస్ పెంచుతుంది. దీంతో ఈ సర్వేలో ఈసారి 10వ స్థానం దక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X