twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Most Popular Female Stars: సినిమాలు లేకపోయినా టాప్ లిస్ట్ లోనే అనుష్క.. సమంత మరోసారి టాప్ లోనే..

    |

    ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొనసాగుతున్న కొన్ని సర్వేలు సినీ తారల రేంజ్ ను కూడా అమాంతంగా పెంచుతున్నాయి. దానికి తోడు ఫ్యాన్స్ కూడా ఈ ర్యాంక్స్ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అలాగే డిజిటల్ ప్రపంచంలో సర్వేలు నిర్వహిస్తున్న ఓరామాక్స్ ఇటీవల మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ కు సంబంధించి తెలుగు హీరోయిన్స్ పై సర్వే నిర్వహించింది. ఇక సెప్టెంబర్ నెలలో ఎవరు ఏ ర్యాంక్స్ అందుకున్నారు అనే వివరాల్లోకి వెళితే..

    సమంత, కాజల్ అగర్వాల్

    సమంత, కాజల్ అగర్వాల్

    ఎప్పటిలానే సమంత మరోసారి టాప్ నెంబర్ వన్ లో కొనసాగుతోంది. ఆమెకు సంబంధించిన యశోద సినిమా ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతోంది. ఇక కాజల్ అగర్వాల్ రెండవ స్థానంలో నిలవడం విశేషం. ఆమె ఎక్కువగా తన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ తోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. దీంతో ఓరామాక్స్ సర్వేలో కాజల్ రెండవ ర్యాంక్ అందుకుంది.

    అనుష్క శెట్టి, సాయి పల్లవి

    అనుష్క శెట్టి, సాయి పల్లవి

    ఇక అనుష్క శెట్టి కి సంబంధించిన సినిమాలేమీ కూడా ఇటీవల కాలంలో అయితే రాలేదు. కానీ ఆమె ఎప్పుడూ కనిపించినా కూడా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ గా అనుష్క శెట్టి కృష్ణంరాజు అనారోగ్యంతో ఉన్నారు అని హాస్పిటల్ కి రాగా ఆమె పేరు ఒక్కసారిగా డిజిటల్ మీడియా వైరల్ అయ్యింది. ఇక ఈ సర్వేలో అనుష్క మూడవ స్థానంలో నిలిచింది. ఇక టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఓరామ్యాక్స్ సర్వేలో మరోసారి టాప్ లో నిలిచింది. ఆమెకు నాలుగో ర్యాంకు దక్కింది.

    పూజా హెగ్డే, తమన్నా

    పూజా హెగ్డే, తమన్నా

    బుట్ట బొమ్మ పూజా హెగ్డే గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. సినిమాలు సక్సెస్ అవుతున్నా లేకున్నా కూడా ఆమె సోషల్ మీడియాలో నిత్యం తన ఫోటోలతో గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో ఆమె సర్వేలో 5వ స్థానంలో నిలిచింది. ఇక ఆమె తర్వాత తమన్న 6వ స్థానంలో నిలిచింది. రీసెంట్ గా బబ్లీ బౌన్సర్ అనే సినిమాతో తమన్న ప్రేక్షకులను పలకరించింది.

    రష్మిక మందన్న, కీర్తి సురేష్

    రష్మిక మందన్న, కీర్తి సురేష్

    ఏడో స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిలిచింది.ఎక్కువగా పుష్ప 2 సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఇటీవల సీతారామం కూడా సక్సెస్ కావడంతో ఆమె పేరు బాగా వైరల్ అయింది. ఇక మహానటి కీర్తి సురేష్ మరోసారి టాప్ లిస్టులో నిలిచింది. ఈ సర్వేలో 8వ స్థానం దక్కించుకున్న కీర్తి సురేష్ తదుపరి సినిమాలకు సంబంధించి వార్తలతోనే ఎక్కువగా హైలెట్ అయింది.

    కృతి శెట్టి, అనుపమ పరమేశ్వరణ్

    కృతి శెట్టి, అనుపమ పరమేశ్వరణ్

    ఇక చివరి రెండు స్థానాలలో కృతి శెట్టి అనుపమ పరమేశ్వరన్ నిలిచారు. కృతి శెట్టి ఇటీవల కాలంలో అయితే వరుస డిజాస్టర్స్ అందుకున్నప్పటికీ కొన్ని ఫోటోషూట్స్ నెటిజన్స్ ను బాగానే ఎట్రాక్ట్ చేసింది. దీంతో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. క్యూట్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా కార్తికేయ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో ఓరామ్యాక్స్ సర్వేలో 10వ స్థానంలో నిలిచింది.

    English summary
    Ormax stars india Most Popular Female Stars in telugu september ranks
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X