Top 10 Heroines: మరోసారి సమంత నెం 1.. రష్మిక, శ్రీలీల ర్యాంక్ ఇదే!

Top 10 Heroines: ప్రముఖ మీడియా రీసెర్చ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా (Ormax Media) ప్రతి నెల హీరోలు,హీరోయిన్లకి సంబంధించిన టాప్‌ 10 జాబితాని విడుదల చేసే విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి 2026కు సంబంధించిన టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాను 'ఇండియా లవ్స్' అనే పేరుతో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ జాబితా విడుదల కావడంతో ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి నెల ప్రేక్షకుల అభిరుచులు, సోషల్ మీడియా ట్రెండ్స్, తాజా సినిమాల ప్రభావం, బ్రాండ్ వ్యాల్యూ వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ సిద్ధం చేస్తారు. మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరు? ఏ హీరోయిన్ ఏ స్థానంలో నిలిచింది? అనే వివరాల్లోకెళ్తే..

సమంత వరుసగా టాప్‌లోనే!
ఈసారి కూడా సమంత రూత్ ప్రభు తన సత్తా చాటుతూ వరుసగా నాలుగో నెల నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. సినిమాలు తక్కువ చేసినప్పటికీ, వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్, సోషల్ మీడియాలో ఉన్న భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ జాబితాలో ఆమె టాప్‌లో నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో సమంతకు ఉన్న క్రేజ్ ఈ ర్యాంకింగ్ ద్వారా మరొకసారి స్పష్టమైంది. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్‌గా ఆమె స్థానం మరింత బలపడుతోంది.

Ormax Top 10 Heroines List 2026 Samantha Tops Rashmika Sreeleela Rankings Revealed

రెండో స్థానంలో బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ నిలవగా, మూడో స్థానానికి నయనతార ఎగబాకింది. గత నెలలతో పోలిస్తే నయనతార ర్యాంక్ పెరగడం ఆసక్తికరంగా మారింది. ఆమె సినిమాలు, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రష్మిక మందన్న నాలుగో స్థానంలో నిలిచి తన పాన్ ఇండియా ఫాలోయింగ్‌ను కొనసాగిస్తోంది.

ఇక కాజల్ అగర్వాల్ ఐదో స్థానంలో ఉండగా, త్రిష కృష్ణన్ ఆరో స్థానానికి పడిపోయింది. ఇటీవల పెద్దగా కొత్త సినిమాలు లేకపోవడం, ప్రాజెక్టుల అప్‌డేట్స్ తక్కువగా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ఏడో స్థానంలో నిలవడం కూడా చర్చనీయాంశమైంది. భారీ స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, తాజా విడుదలలు లేకపోవడం ఆమె ర్యాంక్‌పై ప్రభావం చూపిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఎనిమిదో స్థానంలో సాయి పల్లవి మరోసారి తన స్థానం నిలబెట్టుకుంది. కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను కొనసాగిస్తున్న ఆమెకు స్థిరమైన ఫ్యాన్ బేస్ ఉన్నట్లు ఈ ర్యాంకింగ్ తెలియజేస్తోంది. ఇక తమన్నా భాటియా ఈసారి 9వ స్థానానికి ఎగబాకగా, యంగ్ సెన్సేషన్ శ్రీలీల 10వ స్థానానికి పడిపోయింది. ఇటీవల భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ట్రెండ్‌లో మార్పులు, పోటీ పెరగడం కారణంగా ఆమె ర్యాంక్ తగ్గినట్లు తెలుస్తోంది.

ఈ జాబితాను పరిశీలిస్తే.. సౌత్ హీరోయిన్ల ఆధిపత్యం కనిపిస్తోంది. టాప్ 10లో ఎనిమిది మంది దక్షిణాది హీరోయిన్లు ఉండటం ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సౌత్ డామినేషన్ కొనసాగుతోందనే అర్థం చేసుకోవచ్చు.బాలీవుడ్ నుంచి కేవలం ఆలియా భట్, దీపికా పదుకొణె మాత్రమే ఈ లిస్ట్‌లో నిలవగలిగారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో సౌత్ సినిమాల ప్రభావం ఎంత పెరిగిందో సూచిస్తోంది. ఇక గతంలో ఈ జాబితాలో చోటు సంపాదించిన అనుష్క శెట్టి ఈసారి పూర్తిగా టాప్ 10కు దూరమవడం కూడా గమనించాల్సిన అంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X